ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా పటిష్ట బందోబస్తు
పాలకొండ, సూర్య : నగర పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని డీఎస్పీ రాంబాబు తెలిపారు.ఎస్పీ మాధవ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టామని చెప్పారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. ముఖ్యంగా యువత ఎన్నికల సమయంలో ఎలాంటి తగాదాలకు వెళ్లకుండా సంయమనం పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని డీఎస్పీ రాంబాబు కోరారు.ఈయన తో పాటు సిఐ ప్రసాదరావు, ఎస్సై వెంకన్న వున్నారు.