49 వ వార్డును ఉత్తమ వార్డుగా చేస్తాను.. వైసీపీ అభ్యర్థి బొడ్డేటి మాధవి కిరణ్
సీతమ్మధార, సూర్య : జీవీఎంసీ 48వ వార్డును ఉత్తమ వార్డుగా అభివృద్ధి చేస్తానని వైసిపి అభ్యర్థి బొడ్డేటి మాధవి కిరణ్ అన్నారు. 49 వ వార్డులో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీవీఎంసీ 49 వ వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఓటర్ మహాశయులకు తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పార్కులు, డ్రైనేజీలు, రోడ్లు విద్యుత్ దీపాలు వాటిని మరింత అభివృద్ధి చేస్తానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో బొడ్డేటి కిరణ్ కుమార్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.