ఉత్తర నియోజకవర్గం 54వార్డులో జీవీఎంసీ ఎన్నికల ప్రచారం
సీతమ్మధార, సూర్య : జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 54వార్డు వై.యస్.ఆర్ నగర్, సత్యసాయినగర్, నరసింహ నగర్, సీతమ్మదార, బిలాల్ కోలనిలో జరిగిన ప్రచారంలో రీజనల్ కో-ఆర్డినెటర్లు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాధ్, విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుకు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె రాజు పాల్గొని వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి వరుదు కల్యాణికి, 54 వార్డు కార్పొరేటర్ అభ్యర్థి బాణాల శ్రీనివాసరావుకి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అకండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఈప్రచారంలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, మాజీ కార్పొరేటర్ కె.అనిల్ కుమార్ రాజు, వార్డు అధ్యక్షుడు పైడి రమణ, 54 వార్డు సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళాలు, తదితరులు పాల్గొన్నారు.