ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం - జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
సూర్య- బిక్కనూర్ : ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి చెప్పారు. శుక్రవారం మండలంలోని రామేశ్వర్ పల్లి లో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సంబంధించిన ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపి, ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో,డీఎల్‌పీఓ శ్రీనివాస్ ఎంపీడీవో సవితారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎడ్ల రాజా రెడ్డి గ్రామ సర్పంచ్ చేపూరి రాణి రాజు, ఉపసర్పంచ్ గొల్లపల్లి వినోద్ కుమార్ గౌడ్, వీడీసీ అధ్యక్షుడు మద్ది సూర్యకాంత్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ నాగర్తి రమేష్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఏలేటి బాపురెడ్డి, వార్డు సభ్యులు మన్నే కళ్యాణి రవి,పనాస రాజు, పంచాయతీ కార్యదర్శి శ్యామ్, సీనియర్ నాయకులు మామిడి శ్రీనివాస్ రెడ్డి, పెంటయ్య, చేపూరి అనిల్, రాగట్లపల్లి రవి, లబ్ధిదారులు చేపూరి యశోద రమేష్, పంబల్ల జ్యోతి, మహిళలు పాల్గొన్నారు.