ఘనంగా ప్రారంభమైన అయ్యప్ప స్వామి మండల దీక్షలు
కొత్తవలస, సూర్య : మండలంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గల అయ్యప్ప స్వామి సేవ పీఠం భక్తుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి సేవా పీఠం మండల దీక్షలు “ శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురుస్వామి పైలదేముల ఆధ్వర్యంలో భక్తులు 41 రోజుల పాటు మండల దీక్షను ఆచరించనున్నారు. దీక్షా కాలంలో నియమ నిష్ఠలతో స్వామివారిని పూజిస్తూ, అయ్యప్ప నామస్మరణతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అయ్యప్ప స్వామి భక్తులతో ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.