BREAKING
తూముకుంటలో కూటమి నేతల ఎన్నికల ప్రచారం 58వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ కంబాలపల్లి ఎంపీటీసీగా తిక్కమ్మనేని మంజుల ఏకగ్రీవం కూటమి పాలనలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి గండిగూడెంలో కూటమి అభ్యర్థుల ఇంటింటా ప్రచారం ఎంపీటీసీ-2 అభ్యర్థి శీలం వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ అభ్యర్థి కూరపాటి సుజాతకు మద్దతుగా ప్రచారం ఎల్నినో ప్రభావంతో నీటి పొదుపునకు ప్రాధాన్యం మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి. కూటమి ప్రభుత్వం రైతులను అన్ని విధాల ఆదుకుంటుంది ఎమ్మెల్యే దగ్గుపాటి ఆధ్వర్యంలో దోపిడీ పాలన ఈస్గాం పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ అనకాపల్లి జిల్లాలో"ఆర్నాబ్" తుఫాను సహాయక చర్యల కోసం రూ. 2,05,50,000/- ముందస్తు నిధుల విడుదల తడగొండ వార్డు సభ్యుడు జగదీష్ వర్ధన్ కు జిల్లా ఉపాధ్యక్ష బాధ్యతలు సలుగుపల్లిలో వృథాగా పోతున్న మిషన్ భగీరథ నీళ్లు! - పట్టించుకోని సిబ్బంది.. దౌలాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్‌ దుర్మరణం ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే పాటించి దోమల సమాజాన్ని నిర్మిద్దాం

తాగునీటి నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి

Select Suryaa Now
తాగునీటి నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి

తిరువూరు, మేజర్ న్యూస్: అర్నబ్ తుఫాను అనంతరం ప్రజారోగ్య పరిరక్షణకు సురక్షిత తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. గురువారం తిరువూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో పర్యటించిన కలెక్టర్ స్థానిక నీటి ట్యాంకు వద్ద తాగునీటి నమూనాల పరీక్ష విధానాలను పరిశీలించారు. నీటి నాణ్యతను నిర్ధారించేందుకు తీసుకుంటున్న చర్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుపాను అనంతరం వర్షపు నీరు, మురుగునీరు తాగునీటి వనరుల్లో కలిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కలుషిత నీటి వినియోగం వల్ల విరేచనాలు, ఇతర వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని తెలిపారు. నీటి ట్యాంకులు, పైపులైన్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయడంతోపాటు, అవసరమైన చోట నీటి నమూనాలను సేకరించి పరీక్షించాలని ఆదేశించారు. ట్యాంకులను శుభ్రపరచడం, నిబంధనల ప్రకారం క్లోరినేషన్ చేపట్టడం, నీటి నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో తిరువూరు ఆర్డీవో ఎ. కుమార్, స్థానిక అధికారులు పాల్గొన్నారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, తిరువూరు నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా.