ఎల్నినో ప్రభావంతో నీటి పొదుపునకు ప్రాధాన్యం మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి.
ఎల్నినో ప్రభావం నేపథ్యంలో తాగునీటి పొదుపుపై ప్రత్యేక దృష్టి సారించి, నీటి వృథాను అరికట్టాలని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి సూచించారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్ అప్పాల కావ్య అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పట్టణ అభివృద్ధి, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, మౌలిక వసతులు, వార్డుల సమస్యలపై చర్చించారు. ప్రజలకు నీటి పొదుపుపై అవగాహన కల్పించాలని, వార్డుల్లో సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. తాగునీటి సరఫరాలో అంతరాయాలు లేకుండా, పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎం. రవిబాబు, అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.