BREAKING
జోరుగా గడప గడపకు వైసిపి అభ్యర్థులు ప్రచారం మత్స్యకారులకు అండగా ప్రభుత్వం నేటి నుండి టిడిపి జడ్పిటిసి అభ్యర్థి ప్రచారం ప్రారంభం చీరాల సబ్‌ డివిజన్‌ పరిధిలోని అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన యూఎస్ ఫెడరల్ రిజర్వ్.. 10-2 ఓట్ల తేడాతో కీలక నిర్ణయం! భారీ వర్షాల నేపథ్యంలో 300 మందికి సురక్షిత ఆశ్రయం సోలార్ ఎనర్జీ సేవలు ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ సీఎం సురేష్* పేదింటి ఆడపడుచు పెళ్లికి సర్పంచ్ కానుక శభాస్ సంపత్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు... హెలెన్ కన్సమ్షన్ ఖర్చులపై ద్రవ్యోల్బణ ప్రభావం నీటిలో మునిగిపోయిన పంటలను పరిశీలించిన....డాక్టర్ జి జోగి నాయుడు. గుడ్లూరు చెరువు చెక్ పోస్ట్ వద్ద ఎస్.ఎస్.టి (SST) తనిఖీలను ఆకస్మికంగా పరిశీలించిన జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి ఉధృతంగా ప్రవహిస్తున్న గోముఖీ, సువర్ణముఖి నదులు మునిసిపల్ ఎన్నికలపై జిల్లా ఎస్పీ సమీక్ష

వైసిపి అభ్యర్థులపై పూల వర్షం కురిపిస్తూ.. ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు.

Select Suryaa Now
వైసిపి అభ్యర్థులపై పూల వర్షం కురిపిస్తూ.. ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు.

నెల్లూరు రూరల్,  మేజర్ న్యూస్ :   నెల్లూరు బాలాజీ నగర్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ   ఎన్నికల ప్రచార కార్యక్రమానికి.. వైసిపి జిల్లా అధ్యక్షులు  కాకాణి గోవర్ధన్ రెడ్డి , వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి , హాజరై  వైసిపి మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి   19వ డివిజన్ వైసిపి కార్పొరేటర్ అభ్యర్థి యలమందా రెడ్డి గార్లతో కలిసి.. ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా  వారికి పార్టీ శ్రేణులు భారీ గజమాలతో..ఘన స్వాగతం పలికాయి .  అనంతరం  అభ్యర్థులు ప్రజలకు అబివాదం చేస్తూ.. నవంబర్ 1న జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు ఫ్యాను గుర్తుకు ఓటు వేసి ..నెల్లూరు నగర మేయర్ గా  ఆనం విజయ కుమార్ రెడ్డి ని, 19వ డివిజన్  కార్పొరేటర్ గా యలమందా రెడ్డి ని  గెలిపించాలని ప్రజలను కోరారు.   నెల్లూరు నగర కార్పొరేషన్.. దోపిడీదారులకు..అడ్డగా మారిపోయిందని.. కార్పొరేషన్ సొమ్మును అడ్డగోలుగా దోచుకుంటూ.. కూటమి నేతలు జోబులు నింపుకుంటున్నారని  ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి  ధ్వజమెత్తారు.  ఈరోజు నగర కార్పొరేషన్ లో ఏమి జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు.   వేసిన రోడ్లే మళ్లీ వేయడం, చెట్టు వేసిన చోటే మళ్లీ గుంతతవ్వి చెట్టు నాటడం చేస్తూ.. కార్పొరేషన్ను అవినీతి బాట పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు ఇంటి పన్ను చెల్లించకపోతే.. వారిని కోర్టులకి ఈడుస్తున్న.. పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలోనే.. జరిగిందన్నారు.   దోపిడీదారులకు అడ్డగా మారిపోయిన కార్పొరేషన్ను రక్షించుకోవాలంటే.. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.  కార్పొరేషన్ లో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ...ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.