నేటి నుండి టిడిపి జడ్పిటిసి అభ్యర్థి ప్రచారం ప్రారంభం
గరుగుబిల్లి, సూర్య : తెలుగుదేశం పార్టీ తరఫున మండల జిల్లా ప్రాదేశిక సభ్యురాలుగా పోటీ చేస్తున్న కారాడ వెంకటమ్మ శుక్రవారం నుంచి ప్రచారమును ప్రారంభించనున్నారు.ఈమేరకు జడ్పిటిసి అభ్యర్థి కారాడ వెంకటమ్మ శుక్రవారం లఖనాపురం గ్రామం నుంచి ప్రచారమును ప్రారంభించడం జరుగు తుంది.లఖనాపురం, రావివలస, చిలకాం, నాగూరు, తోటపల్లి,గిజబ గ్రామాలలో ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి జడ్పిటిసి అభ్యర్థి కారాడ వెంక టమ్మ ప్రచారం నిర్వహించనున్నారు. శుక్రవారం నుంచి జడ్పిటిసి అభ్యర్థి కారాడ వెంకటమ్మ ప్రచారం ప్రారంభిం చనున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమం లో మాజీ మండల పరిషత్ అధ్యక్షులు ఉరిటి రామారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరడాన తవిటి నాయుడు తదితరులు పాల్గొననున్నారు. ఆయా గ్రామాల ఎంపీటీసీ స్థానాల కు పోటీ చేస్తున్న అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహించనున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యక ర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని జడ్పిటిసి అభ్యర్థి కారాడ వెంకటమ్మ కోరారు.