భారీ వర్షాల నేపథ్యంలో 300 మందికి సురక్షిత ఆశ్రయం
పాలకొండ, సూర్య : గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ జిల్లా కలెక్టర్ డా ఎన్ ప్రభాకర్ రెడ్డి సూచనల మేరకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. తుఫాను ప్రభావంతో లుంబుర ఎస్సీ కాలనీలోకి వరద నీరు చేరడంతో అక్కడ నివసిస్తున్న సుమారు 300 మందిని అధికారులు సురక్షితంగా సమీపంలోని చర్చిలోకి తరలించి ఆశ్రయం కల్పించారు. తహసీల్దార్ రాధాకృష్ణమూర్తి ఆధ్వర్యంలో బాధితులకు భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు వరద పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చి నీరు తగ్గే వరకు ఎవరూ బయటకు వెళ్లవద్దని తహసీల్దార్ సూచించారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని జిల్లా యంత్రాంగం సూచించింది.