కూటమి అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తాం
కూటమి అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తాం
తెనాలి, న్యూస్ : మున్సిపల్ చైర్మన్ గా పోటీ చేసిన కూటమి అభ్యర్థి తోటకూర వెంకట రమణారావు, ఆయన వార్డుల్లో పోటీ చేసిన కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించటానికి తమ సహకారం ఉంటుందని తెనాలి హోటల్స్ అసోసియేషన్, రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంటపురం, రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర పారిస్ తెనాలి సభ్యులు పేర్కొన్నారు. తెనాలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల ఈ కన్వెన్షన్ లో జరిగిన కార్యక్రమంలో కూటమి అభ్యర్థుల గెలుపును ఆకాంక్షిస్తూ సమావేశం నిర్వహించారు. చైర్మన్ అభ్యర్థి తోటకూర వెంకటరమణ రావు, పలువురు కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్వై అభ్యర్థి తోటకూర వెంకటరమణరావును ఘనంగా సత్కరించారు. వైకుంఠపురం దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఈదర వెంకట పూర్ణ చంద్, కాకతీయ బ్యాంక్ చైర్మన్ దావులూరి చక్రధర్ చౌదరి, హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు కనికిచర్ల రమా కాంత్, తెనాలి వైకుంఠం రోటరీ క్లబ్ అధ్యక్షుడు గుమ్మడి సరోజ్ బాబు, ఆంధ్ర పారిస్ క్లబ్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ గాజుల విజయసారధి, కార్యదర్శులు రాజేంద్రప్రసాద్, ఎర్రగుంట్ల మహేష్, సభ్యులు గుత్తా వెంకటరత్నం, నల్లూరి వెంకటేశ్వరరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు,