బియ్యం కోసం ప్రజల అవస్థలు
నరసరావుపేట: పట్టణం లోని సత్తెనపల్లి రోడ్డు లో గల ఆవుల సత్రం నందు ధరణి రైస్ విక్రయ కేంద్రం వద్ద బియ్యం కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 10.30 గంటలకు బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు బారులు తీరారు. అయితే సమయానికి పంపిణీ ప్రారంభం కాకపోవడంతో గంటల తరబడి ఎండలో నిరీక్షించారు. ఈ క్రమంలో నిర్వాహకులకు, ప్రజలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నిర్వాహకులు దురుసుగా మాట్లాడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. బియ్యం పంపిణీ సక్రమంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
మల్లికార్జున రావు పల్నాడు జిల్లా ఇన్చార్జి..