మున్సిపల్ ఎన్నికల పర్యవేక్షణకు తిరుపతి కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్
రేణిగుంట మేజర్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించేందుకు తిరుపతి జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఎన్నికలకు సంబంధించి ప్రజలు తమ ఫిర్యాదులు, సమస్యలు, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారాన్ని కంట్రోల్ రూమ్‌కు తెలియజేయవచ్చని తెలిపారు. ఇందుకోసం 0877-2236007 నంబర్‌ను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికలకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని కోరారు.