అభివృద్ధి కాంక్షించే ప్రతి ఒక్కరూ… కూటమి అభ్యర్థులను గెలిపించండి - మంత్రి పార్థసారథి అభ్యర్థన
నూజివీడు, మేజర్ న్యూస్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలోకి తీసుకు వెళుతోందని రాష్ట్ర గృహ నిర్మాణ సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. జరుగుతున్న స్థానిక సంస్థలు ఎన్నికలలో అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. అన్ని రంగాల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. పురపాలక సంఘం ఎన్నికల ప్రచార పర్వానికి చివరి రోజైన శుక్రవారం నాడు మంత్రి పార్థసారథి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేన బిజెపి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ప్రచార ర్యాలీ నిర్వహించారు. స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి పార్థసారథి విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా నూజివీడు పురపాలక సంఘం లో కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.
కూటమి ప్రభుత్వం రెండున్నర ఏళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని, గత వైసీపీపార్టీ ప్రభుత్వం చేసిన పనులను ప్రతి ఒక్కరూ బేరీజు వేసుకోవాలని అన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో అన్ని వ్యవస్థలతో పాటు నీటిప్రాజెక్టులను సర్వనాశనం చేశారని అన్నారు. రూ 13 లక్షలు కోట్లరూపాయలు అప్పులు చేశారని, రాష్ట్రాన్ని మరో 20 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారని అన్నారు. పోలవరం రెండు ఏళ్లలో పూర్తిఅవ్వవలసింది మరో నాలుగు ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని, రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని వాళ్ళు చేసిన పాపాలు ఎవరు భర్తీచేస్తారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అపార అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆరునెలలు దాకా రాష్ట్రాన్ని చక్కదిద్దుటకు ఒక ఆలోచన రాలేదని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను గోదావరి పుష్కరాలు లోపుగా పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసి జాతికి అంకిత చేస్తామని అన్నారు. గ్రామీణ ప్రాంతాలు ఉపాధి,సర్వతో ముఖాభివృద్ధి కోసం కేంద్రప్రభుత్వం 'వికసిత్ భారత్ జీ రామ్ జీ' ద్వారా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో రూ 11 వేల కోట్ల రూపాయలతో రాష్ట్రంలో పూజ్యభాపూజీ కలలుకన్న గ్రామస్వరాజ్యం పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు, పంచాయతీలకు వచ్చిన ప్రతి రూపాయి గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగించుకునేలా పూర్తి అధికారాలు ఇచ్చారని, ఇది మంచి శుభపరిణామని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుటకు పారిశ్రామిక వేత్తలు వస్తున్నారని, భారీపరిశ్రమలు స్థాపనలు, 36 నీటిప్రాజెక్టులు, యువతకు 20 లక్షలు ఉద్యోగాలు అందించుటకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దిష్టిసారించారని అన్నారు.
చింతలపూడి ప్రాజెక్టు అన్ని అడ్డంకులు తొలగిపోయాయని, రెండుఏళ్లలో పూర్తిచేసి ఈ ప్రాంతాలకు త్రాగునీరు, సాగునీరు అందించి ప్రజలు, రైతులు చిరకాల కోరిక తీరుస్తామని అన్నారు. నూజివీడు నియోజకవర్గానికి అనేక పరిశ్రమలు రాబోతున్నాయని, ఈ ప్రాంత అభివృద్ధితో పాటు యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు మెండుగా కలుగుతాయని అన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో మునిపాలిటీకి కేవలం రూ 5 కోట్లు అభివృద్ధి పనులుచేస్తే, కూటమి ప్రభుత్వంలో రెండున్నర ఏళ్లలో రూ 88.46 కోట్లతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, 85 శాతం పూర్తయ్యాయని తెలిపారు. ఎన్నికలు అయిన తర్వాత దశలు వారీగా ప్రారంభోత్సవాలు చేసి ప్రజలకు వాడుకలోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. నూజివీడు మున్సిపాలిటీ మరింత అభివృద్ధికి రూ 155 కోట్ల రూపాయలు ప్రపోజల్స్ పంపించడం జరిగిందన్నారు. రెండు పూటలు పుష్కలంగా త్రాగునీరు, రోడ్డులు, డబుల్ లైను రోడ్డులు, సెంటరు లైటింగులు, డ్రైనేజీలు, పార్కులు, కమ్యూనిటీ హాలు, అన్ని వర్గాలు వారికి కళ్యాణ మండపాలు, స్మశానవాటిక అభివృద్ధి పనులు, శానిటేషన్, తదితరు పనులు పూర్తి చేస్తున్నామని అన్నారు. వార్డుల్లో పర్యటించి నప్పుడు ప్రజలు కోరుకున్న పనులు, సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నామని అన్నారు. ప్రజాసమస్యలుపై ఎప్పటికప్పుడు అధికారులు దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం చూపుతున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమమే కూటమిపార్టీ అభ్యర్థులు విజయానికి శ్రీరామరక్ష అని అన్నారు. 36 వార్డు కౌన్సిలర్ తో పాటు చైర్మన్ అభ్యర్థిని కూడా గెలిపించాలని మంత్రి పార్థసారధి కోరారు. ఈ కార్యక్రమంలో కూటమిపార్టీ చైర్మన్ అభ్యర్థి బర్రె ఇళయరాజా, పోటీలో ఉన్న కౌన్సిలర్లు అభ్యర్థులు,కూటమి పార్టీనాయకులు, తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ ప్రసాద్ నూజివీడు ఏలూరు జిల్లా