BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

ఏలూరు పార్లమెంట్ టీడీపీ డిన్నర్ మీట్ -- ఎమ్మెల్యే చింతమనేని ఆతిథ్యంలో జరిగిన అక్టోబర్ నెల సమావేశం --మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు పక్కా రోడ్‌మ్యాప్ సిద్ధం

Select Suryaa Now
ఏలూరు పార్లమెంట్ టీడీపీ డిన్నర్ మీట్                      -- ఎమ్మెల్యే చింతమనేని  ఆతిథ్యంలో జరిగిన అక్టోబర్ నెల సమావేశం  --మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు పక్కా రోడ్‌మ్యాప్ సిద్ధం

పెదవేగి, మేజర్ న్యూస్ : పార్టీ నియమావళి, సాంప్రదాయం ప్రకారం ప్రతి నెలా నిర్వహిస్తున్న ఏలూరు పార్లమెంట్ టీడీపీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల ఆత్మీయ డిన్నర్ మీట్ అక్టోబర్ నెలకు సంబంధించి శుక్రవారం రాత్రి దుగ్గిరాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో   జరిగింది. దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ విందు సమావేశానికి  జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్, ట్రైకార్ ఛైర్మన్ పోలవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బోరగం శ్రీనివాస్, కైకలూరు ఇన్‌ఛార్జ్ కొత్త నాగేంద్ర హాజరయ్యారు.

ఈ సందర్భంగా నేతలంతా కలిసి తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల సమన్వయంతో అన్ని స్థానాల్లోనూ అభ్యర్థుల సంపూర్ణ విజయమే లక్ష్యంగా అనుసరించాల్సిన కార్యాచరణపై లోతైన మంతనాలు జరిపారు. నియోజకవర్గాలవారీగా క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు చర్చించారు.