తుఫాను బాధితులకు అండగా ఉందుర్తి పాల్ ఫౌండేషన్
తణుకు,మేజర్ న్యూస్ : ఆర్నాబ్ తుఫాను బాధితులకు ఉందుర్తి పాల్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ఆపన్నహస్తం అందించింది. పట్టణంలోని డంపింగ్ యార్డు సమీపంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి చీకట్లో మగ్గుతున్న పేద కుటుంబాలకు ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ ప్రసన్న కుమార్ ఉందుర్తి ఆధ్వర్యంలో రాత్రి 11 గంటలకు రూ.8,600 విలువైన 20 లైట్లను పంపిణీ చేశారు. విపత్కర పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలవడమే తమ ఫౌండేషన్ లక్ష్యమని ప్రసన్న కుమార్ పేర్కొన్నారు. పేదల సంక్షేమానికి విద్య, వైద్యం, ఆహార పంపిణీ తదితర సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు.