BREAKING
కమలం గుర్తుకు ఓటెయ్యండి - బిజెపి నేత కోలా ఆనంద్ ప్రతిష్టాత్మక 'ఏబీయూ బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్' అవార్డు కైవసం! జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు తరలింపునకు డీపీఆర్‌ సిద్ధం చేయండి.. నిధులు తెచ్చే బాధ్యత నాది: ఎంపీ ఈటల రాజేందర్‌ ఏలూరు నగర అభివృద్ధికై బ్లాక్ బోర్డు గుర్తుకు ఓటెయ్యండి టిడిపి, జనసేన, బిజెపి పార్టీల అభ్యర్థులను ఏకపక్షంగా గెలిపించాలి -- విలేకరుల సమావేశంలో టిడిపి జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి, మేయర్ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు సేవ గుణం. చాటుకున్న ఉపాధ్యాయుడు. తన జీతం డబ్బులతో ముప్పై వేల రూపాయలు పిల్లలకు వైట్ డ్రస్ లు. టీనేజర్ల మానసిక ఆరోగ్య వ్యాజ్యాల విచారణ సమయంలోనే మెటా కీలక సెటిల్మెంట్! కాశ్మీరీల తరఫున మాట్లాడిన బ్రిటిష్ కౌన్సిలర్ దాలత్ అలీని అడ్డుకున్న పాక్ అకాల వర్షంతో అన్నదాతల్లో ఆందోళన.. మేడ్చల్‌ పరిసరాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం అభివృద్ధి కాంక్షించే ప్రతి ఒక్కరూ… కూటమి అభ్యర్థులను గెలిపించండి - మంత్రి పార్థసారథి అభ్యర్థన మున్సిపల్ ఎన్నికల పర్యవేక్షణకు తిరుపతి కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ చైనా రక్షణ రంగంలో యుద్ధనౌకపై నుంచి తొలిసారిగా స్టీల్త్ అటాక్ డ్రోన్ టేకాఫ్ మరియు ల్యాండింగ్! ఢిల్లీ వాసులకు ఊరట: 'సంతృప్తికరం' కేటగిరీలోకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తుఫాను బాధితులకు అండగా ఉందుర్తి పాల్ ఫౌండేషన్ జీ-20 సదస్సులో రష్యా మంత్రి రాకతో నిలిచిపోయిన సంప్రదాయ గ్రూప్ ఫోటో!

వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం రాచానుపల్లిలో విస్తృత ప్రచారం

Select Suryaa Now
వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం రాచానుపల్లిలో విస్తృత ప్రచారం

అనంతపురము రూరల్ మేజర్ న్యూస్ : అనంతపురం రూరల్ మండలం వైసీపీ జడ్పిటిసి అభ్యర్థి రోహిణి, రాచానుపల్లి  ఎంపీటీసీ 2 అభ్యర్థి లక్ష్మీని గెలిపించాలని.. వైసీపీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం సిండికేట్ నగర్ లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ... నవంబర్  5 న జరిగే ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో..  వైసిపి అభ్యర్థులను బలపరిచి గెలిపించాలని.. ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా గత వైసిపి ఐదేళ్ల పాలనలో.. అభివృద్ధి.. సంక్షేమ పథకాలను.. పారదర్శకంగా లబ్ధిదారుల ఇంటి వద్దకే అందించడం జరిగిందని.. ఇచ్చిన హామీలన్నిటిని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని ప్రజలకు వివరించారు. గత రెండున్నర సంవత్సరాల కూటమి ప్రభుత్వ పాలనలో.. సూపర్ సిక్స్ హామీలను.. అమలు చేయకుండా దగా చేసిందని తెలియజేశారు.  18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రూ. 1500 ఇస్తామని.. చెప్పి రెండున్నర సంవత్సరాలైనా అమలు చేయలేదని ప్రజలకు వివరించారు. 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పింఛన్ ఇస్తామని... ఇంతవరకు ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదని.. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి..   నెలనెలా రూ . 3000 ఇస్తామని .. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.  అధికారం కోసం.. కూటమి పార్టీలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాయి తప్ప... ప్రజల సంక్షేమం కోసం కాదని... నాయకులు తెలియజేశారు. ప్రజలు కూటమి అబద్ధపు హామీలను నమ్మి..  మరోసారి మోసపోవద్దని.... వైసీపీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.