మత్స్యకారులకు అండగా ప్రభుత్వం
మత్స్యకారులకు అండగా ప్రభుత్వం
తుఫాన్ లో దెబ్బతిన్న బొట్లు, వలలకు నష్ట పరిహారం
ఫిషర్మెన్ కో-ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ ఛైర్మెన్ యాటగిరి
కడప, మేజర్ న్యూస్:
ఆర్నబ్ తుఫాన్ కారణంగా మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారని వారికీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తున్నదని ఫిషర్మెన్ కో-ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ ఛైర్మెన్ యాటగిరి రాంప్రసాద్ గురువారం స్పష్టం చేశారు. తుఫాన్ దాటికి దెబ్బతిన్న బొట్లు, వలలకు నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఇవ్వనున్నదని ఆయన పేర్కొన్నారు. గురువారం కడపలో తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పెను గాలులకు ఒడ్డులో ఉన్న బొట్లు ఒకదానికొకటి ఢీ కొని దెబ్బ తిన్నాయన్నారు.వలలు కూడా పాడయ్యాయని తెలిపారు. వీటిపై మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారని కమిషనర్ రామ్ శంకర్ నాయక్ ఈ విషయాలను లిఖిత పూర్వకంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు.స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే నష్ట వివరాలను కేంద్రానికి నివేదిక పంపినట్లు పేర్కొన్నారు. అంతే కాక తుఫాన్ బాధిత మత్స్యకారుల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.