జోరుగా గడప గడపకు వైసిపి అభ్యర్థులు ప్రచారం
జీలుగుమిల్లి, మేజర్ న్యూస్: జీలుగుమిల్లి లో వైసిపి ఎంపీటీసీ అభ్యర్థి గంగుల రమేష్ , జడ్పిటిసి అభ్యర్థి కోర్స సూరమ్మ తన గెలుపు కోసం గడపగడపకు వెళ్లి ఓటర్లను కలుసుకుని ప్రచారం చేస్తూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో భాగంగా ఓటర్లను ఆకర్షించేలా ఓ హోటల్ లో బజ్జీలు వేస్తూ, అక్కడికి వచ్చిన వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటూ తనకు, జడ్పిటిసి అభ్యర్థి కోర్స సూరమ్మ కు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పేదల కోసం వారి సంక్షేమం కోసం పాటుపడే ఏకైక పార్టీ అని, తమను గెలిపిస్తే "మిమ్మల్ని మీరు" గెలిపించుకున్నట్టేనని గుర్తు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి కోసం తమను గెలిపించి, నిజాయితీగల పాలనకు బాటలు వేయలని అన్నారు. ఈ ప్రచారంలో వైసిపి నాయకులు బి ప్రేమ్ కుమార్, చిట్టి బొమ్మ శ్రీనివాసరావు, టోని, గుమ్మళ్ల దుర్గారావు, పోలుకొండ నరసింహారావు, పొ నుకుమటి సాయి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.