BREAKING
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఏపిఎస్ ఆర్టీసీ మాజీ చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం అమెరికా లో మృతి పురుషోత్తమపట్నంలో కూటమి జోరు.. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి జిల్లాలో సెక్షన్ 144 పటిష్టంగా అమలు చేస్తున్నాం : కలెక్టర్ హిమాన్షు శుక్ల పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న 120 మంది ఉద్యోగులు కొనసాగుతున్న కృత్రిమ గాజుల తయారీ శిక్షణ. *మోడల్ స్కూల్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి* గ్రామాల అభివృద్ధికి అడ్డుపడ్డారు.. ఓటుతో బదులివ్వండి ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులు పోలీసుల రక్తదాన శిబిరంలో ఉత్సాహంగా పాల్గొన్న యువత *నిజాయితీ చాటుకున్న విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగి ప్రశాంత్* *పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను పోలీసుల సమక్షంలో బాధితుడికి అప్పగింత* విద్యార్థుల కళా ప్రతిభకు "సాధన 2026"వేదిక అక్టోబర్ 31 నుంచి మౌలానా ఆజాద్ జయంతి ఉత్సవాలు. : విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలు. పలు పంటలను క్షేత్ర సందర్శనలో పరిశీలన. శాస్త్రవేత్తలు పసల కుటుంబానికి న్యాయం చేయాలి

మునిసిపల్ ఎన్నికలపై జిల్లా ఎస్పీ సమీక్ష

Select Suryaa Now
మునిసిపల్ ఎన్నికలపై జిల్లా ఎస్పీ సమీక్ష

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ జిల్లాలో నవంబర్ 1న జరగబోయే మండపేట ,నిడదవోలు మరియు కొవ్వూరు  మున్సిపాలిటీలలో ఉన్న పోలింగ్ కేంద్రాలను, స్ట్రాంగ్ రూములను సందర్శించి అచ్చట భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు .అనంతరం పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు అదనపు ఎస్పీ (అడ్మిన్) దేవరాజ్ పాటిల్ మనీష్ , డీఎస్పీలు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛగా, పారదర్శకంగా  నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ సర్వసన్నద్ధంగా ఉందని  తెలిపారు.  ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అధిక సంఖ్యలో సాయుధ పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్లు (కవాతులు) నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల  పరిధిలో కఠిన నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయన్నారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో అనవసరంగా గుమిగూడడం, ఐదుగురికి మించి గుంపులుగా తిరగడం పూర్తిగా నిషేధమన్నారు.

 ఓటర్లను ప్రభావితం చేసేందుకు నగదు, మద్యం, విలువైన బహుమతులు  ఇతర ప్రలోభపెట్టే వస్తువులను పంపిణీ చేయడం చట్టరీత్యా నేరం. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

ఓటర్లను ఎవరైనా బెదిరించినా, భయపెట్టినా  వారి స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోకుండా అడ్డుకున్నా తక్షణమే కఠిన చర్యలు ఉంటాయి. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగకుండా నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించు కోవాలన్నారు.ఎన్నికల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సమస్యాత్మక వ్యక్తులు, రౌడీషీటర్లు  బయటి ప్రాంతాల వ్యక్తుల కదలికలపై నిరంతరం ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. ప్రజాస్వామ్య బద్ధంగా జరిగే ఈ ఎన్నికలను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని ఎస్పీ  డి. నరసింహ కిషోర్  పిలుపునిచ్చారు