పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదును సద్వినియోగం చేసుకోవాలి
సంస్థాన్ నారాయణపురం. మేజర్ న్యూస్ : ఉమ్మడి నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి పట్టభద్రుడు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని జనసేన పార్టీ మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ శివ కార్తీక్ పిలుపునిచ్చారు. గురువారం నారాయణపురం మండల కేంద్రంలో జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ రిజిస్ట్రేషన్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శివ కార్తీక్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు చైతన్యవంతమైన పాత్ర పోషించాలని కోరారు. ఓటర్ నమోదు గడువు సమీపిస్తున్నందున అర్హులైన గ్రాడ్యుయేట్లు ఆలస్యం చేయకుండా తమ ఓటును నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల పీఓసీలు మెగావత్ రాజు (బద్రి) నాయక్, చిన్నం ప్రశాంత్‌తో పాటు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.