BREAKING
మంథనిలో పుష్కర ఘాట్ అభివృద్ధికి రూ.23 కోట్లు... ఆకలి కేకల దిశగా ప్రపంచం? విజయనగరం సమగ్ర అభివృద్ధే లక్ష్యం..... బీఎస్పీ మేయర్ అభ్యర్థిని లింగాల పార్వతికి మద్దతుగా ప్రచార ర్యాలీ ఆర్నబ్ తుఫాన్ తో 56 హెక్టార్లలో వరి, 4 హెక్టార్లలో పత్తి నష్టం: ఏవో రాష్ట్రస్థాయి యోగా పోటీలకు డి. ప్రదీప్ ఎంపిక పల్లె పోరులో... ప్రచారాల హోరు నగరంలో ముమ్మరంగా ఎమ్మెల్యే దగ్గుపాటి సతీమణి శ్రీలక్ష్మి, కుమార్తె అశ్రిత ఎన్నికల ప్రచారం.. 45, 48 డివిజన్లలో ప్రచార కార్యక్రమం.. దగ్గుపాటి శ్రీలక్ష్మి కి మహిళల నుంచి అనూహ్య స్పందన క్లోరినేషన్ పరీక్షలు తప్పనిసరి --ఆరోగ్య విస్తరణ అధికారి : ఎల్ . సుబ్రహ్మణ్యం ఆశీర్వదించండి.... మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా రూప్ కుమార్ యాదవ్ కు మద్దతుగా మాదిగల ఆత్మీయ సదస్సు కేసీఆర్‌దే హాలిడే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదు: ఆది శ్రీనివాస్ 4వ డివిజన్‌లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ప్రచారం పత్తి పంటను పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం : 3 వ సెగ్మెంట్ యమ్.పి.టి.సి అభ్యర్థిని గా బొల్లా ఈశ్వరి ప్రచారం పెంట, రంగారాయ పురం గ్రామంలో ప్రచారంలో పాల్గొన్న జెడ్పీటీసీ అభ్యర్థి వేణు

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి

Select Suryaa Now
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి

 

చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్ : జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక జడ్పీ కార్యాలయంలోని సమావేశం మందిరంలో జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఆర్వో లతో ఇతర అధికారులకు ఎన్నికల వేళ అనుసరించాల్సిన తీరు, విధులపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్,డిఆర్ఓ కే మోహన్ కుమార్, ట్రైనింగ్ కలెక్టర్ వెంకటేష్, జడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు, ఎంపీడీవోలు, ఏ ఆర్ ఓ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూకౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కౌంటింగ్ సిబ్బంది నియామకం, శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేసి, రిటర్నింగ్ అధికారులు , అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు , కౌంటింగ్ సూపర్‌వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు తదితర సిబ్బంది తమకు కేటాయించిన విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్‌ను నియమించి, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి మండలాల వారీగా కౌంటింగ్ గదులు, టేబుళ్లను ముందుగానే సిద్ధం చేయాలని, జెడ్పీటీసీ బ్యాలెట్ పేపర్లు తెలుపు రంగులో, ఎంపీటీసీ బ్యాలెట్ పేపర్లు గులాబీ రంగులో ఉండే విధంగా వాటిని గుర్తించి వేర్వేరుగా విభజించి సంబంధిత కౌంటింగ్ టేబుళ్లకు పంపిణీ చేయాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను ఈ నెల 29, 30, 31 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.పోస్టల్ బ్యాలెట్ ముద్రణ పూర్తయిన వెంటనే పోటీ చేస్తున్న అభ్యర్థులు లేదా వారి అధీకృత ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ పేపర్లను పరిశీలింపజేసి, ముద్రణ, నంబరింగ్ తదితర అంశాల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్ధారించుకోవాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ పూర్తయిన అనంతరం బ్యాలెట్ బాక్సులను నిర్దేశిత సురక్షిత గదిలో భద్రపరిచి, నిబంధనల ప్రకారం సీల్ వేయాలని, సీసీటీవీ నిఘా  అవసరమైన భద్రతా ఏర్పాట్లు కల్పించాలని ఆదేశించారు.అలాగే, ఎన్నికలకు ముందుగానే స్ట్రాంగ్ రూమ్‌లను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని, బ్యాలెట్ బాక్సుల భద్రతకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సీసీటీవీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లు, ప్రవేశ నియంత్రణ తదితర అంశాలను సంబంధిత అధికారులు తనిఖీ చేయాలన్నారు.సాధారణ బ్యాలెట్ పేపర్ల ముద్రణను ఎన్నికల సంఘం నిర్దేశించిన నమూనా, మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, ముద్రణ అనంతరం రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీఓలు బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థుల పేర్లు, ఎన్నికల గుర్తులు, నంబరింగ్ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఎన్నికల సంఘం, న్యాయస్థానాల మార్గదర్శకాలను పాటిస్తూ ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ఆర్వోలు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.

 

 

ఫోటో. స్థానిక సంస్థల ఎన్నికలలో విధులు నిర్వహించే అధికారులకు సూచనలు ఇస్తున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్.