పెంట, రంగారాయ పురం గ్రామంలో ప్రచారంలో పాల్గొన్న జెడ్పీటీసీ అభ్యర్థి వేణు
బొబ్బిలి, సూర్య : బొబ్బిలి మండలం రంగరాయపురం, పెంట గ్రామంలో బొబ్బిలి వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి శంభంగి వేణు గోపాల్ నాయుడు గురువారం ప్రచారంలో పాల్గొన్నారు. ఈ మేరకు రంగరాయపురం గ్రామంలో ఎంపిటిసి అభ్యర్థ శ్రీమతి కొప్పర సౌజన్య తో కలిసి ఎన్నికల ప్రచారం లో పాల్గొని ఫ్యాన్ గుర్తు పై రెండు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా గ్రామ ప్రజలను కోరారు. అనంతరం బొబ్బిలి మండలం పెంట గ్రామం లో జెడ్పీటీసీ అభ్యర్థి శంభంగి వేణు గోపాల్ నాయుడు, ఎంపిటిసి అభ్యర్థి కడియాల సతీష్ తో కలిసి ఎన్నికల ప్రచారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని అన్నారు. కూటమి ప్రభుత్వానికి బుద్ది రావాలంటే వైఎస్సార్ సీపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల ఫ్యాన్ గుర్తు పై రెండు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా గ్రామ ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో మండల వైఎస్సార్ సీపీ పార్టీ అధ్యక్షుడు దామోదర్, మాజీ పిఏసిఎస్ అధ్యక్షుడు బొమ్మి అప్పలనాయుడు, మాజీ ఎంపిటిసి ఆయా గ్రామస్తులు పాల్గొన్నారు.