BREAKING
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించండి ఎస్పీని కలిసి వివరించిన వైసీపీ, సీపీఐ నేతలు కలెక్టరు వాహనాన్ని మద్యం మత్తులో ఢీ కొట్టిన లారీ డ్రైవర్ కు వారం రోజులు జైలుశిక్ష.... బొబ్బిలి మున్సిపల్ ఎన్నికలకు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కఠిన ఆంక్షలు: మంథనిలో పుష్కర ఘాట్ అభివృద్ధికి రూ.23 కోట్లు... ఆకలి కేకల దిశగా ప్రపంచం? విజయనగరం సమగ్ర అభివృద్ధే లక్ష్యం..... బీఎస్పీ మేయర్ అభ్యర్థిని లింగాల పార్వతికి మద్దతుగా ప్రచార ర్యాలీ ఆర్నబ్ తుఫాన్ తో 56 హెక్టార్లలో వరి, 4 హెక్టార్లలో పత్తి నష్టం: ఏవో రాష్ట్రస్థాయి యోగా పోటీలకు డి. ప్రదీప్ ఎంపిక పల్లె పోరులో... ప్రచారాల హోరు నగరంలో ముమ్మరంగా ఎమ్మెల్యే దగ్గుపాటి సతీమణి శ్రీలక్ష్మి, కుమార్తె అశ్రిత ఎన్నికల ప్రచారం.. 45, 48 డివిజన్లలో ప్రచార కార్యక్రమం.. దగ్గుపాటి శ్రీలక్ష్మి కి మహిళల నుంచి అనూహ్య స్పందన క్లోరినేషన్ పరీక్షలు తప్పనిసరి --ఆరోగ్య విస్తరణ అధికారి : ఎల్ . సుబ్రహ్మణ్యం ఆశీర్వదించండి.... మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా రూప్ కుమార్ యాదవ్ కు మద్దతుగా మాదిగల ఆత్మీయ సదస్సు కేసీఆర్‌దే హాలిడే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదు: ఆది శ్రీనివాస్ 4వ డివిజన్‌లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ప్రచారం

ప్రశాంతయుతంగా ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు ముందస్తు చర్యలు చేపట్టాం

Select Suryaa Now
ప్రశాంతయుతంగా ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు ముందస్తు చర్యలు చేపట్టాం

విజయనగరం, సూర్య : జిల్లాలో మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ముందస్తు చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ  ఎఆర్ దామోదర్  తెలిపారు. జిల్లా ఎస్పీ  ఎఆర్ దామోదర్  మాట్లాడతూ .. జిల్లాలో బొడ్డవర, కందివలస, మోదవలస, చింతలపాలెం, కొట్టక్కి, పిట్టాడ, పొగిరి వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, వాహన తనిఖీలను నిరంతరం చేపడుతున్నామన్నారు. బ్యాంకు భద్రత విధులకు వినియోగించే 67 లైసెన్స్ తుపాకులు మినహా మిగిలిన 340 లైసెన్స్ తుపాకులను స్వాధీనం చేసుకున్నామన్నారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్, బొబ్బిలి మున్సిపాల్టీ, నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో ఎన్నికలు నిర్వహించే అన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శించి, భద్రత ఏర్పాట్లను సమీక్షించామన్నారు. గత ఎన్నికలను, ప్రస్తుత పరిస్థితులకు బేరీజు చేసుకొని హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్, నార్మల్ పోలింగ్ లోకేషన్స్ గా  విభజించి, అందుకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత చర్యలు చేపట్టామన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఎటువంటి అవకాశం లేకుండా లాడ్జీలు, వాహన తనిఖీలు చేపట్టి, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టామన్నారు. ఎక్కువ మొత్తంలో నగదు లావాదేవీలు జరిపే వ్యక్తుల బ్యాంకు ఖాతాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టామన్నారు. సంస్థాగత ఎన్నికల నిర్వహణలో భాగంగా క్షేత్ర స్థాయిలో అల్లర్లకు పాల్పడే వ్యక్తులను పార్టీలకు అతీతంగా 20 వేల మందికి పైగా గుర్తించి, వారిని మంచి ప్రవర్తన కోసం బైండోవరు చేయడమైందన్నారు. హైపర్ సెన్సిటివ్ గ్రామాల్లో పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి, ఎన్నికల్లో శాంతియుతంగా వ్యవహరించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించామన్నారు. హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్ గ్రామాల్లో సద్భావన సభలు నిర్వహించి, ఎన్నికలలో తగాదాలు పడవద్దని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించ వద్దని, పోలీసుశాఖకు సహకరించాలని కోరామన్నారు. గ్రామాల్లో పోలీసు అధికారులు, దత్తత పోలీసులు రాత్రి బస చేసి, గ్రామాల్లో శాంతిభద్రతల పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామన్నారు. బైండోవరు చేసిన వ్యక్తుల నుండి మంచి ప్రవర్తనకు గాను రూ. 2-3 లక్షల వరకు వ్యక్తిగత పూచీకత్తుగా సెక్యూరిటీ బాండ్లను తీసుకొని, ఎన్నికల వివాదాల్లో పాల్గొంటే, సదరు మొత్తాన్ని చెల్లించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునే వాతావరణంను గ్రామ స్థాయిలో కల్పించామన్నారు. రాత్రి గస్తీ పెంచి, 10 గంటల తరువాత పట్టణాలు, గ్రామాల్లో కారణం లేకుండా తిరిగే ఆకతాయిలు హెచ్చరించి, కౌన్సిలింగ్ చేశామని జిల్లా ఎస్పీ  ఎఆర్ దామోదర్ తెలిపారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని, ఏమైనా సమాచారం ఉంటే వెంటనే స్పెషల్ బ్రాంచ్ లో ఏర్పాటు చేసిన ఎలక్షన్ సెల్ కి సమాచారం అందించాలని డీఎస్పీలు ఎస్.లక్ష్మణమూర్తి, ఎస్.రాఘవులు, ఆర్.గోవిందరావు, సంబంధిత సిఐలను, ఎస్సై లను జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ ఆదేశించారు.