ఎన్నికల నిర్వహణపై పి.ఓలకు, ఏ.పి.ఓలకు శిక్షణ
ఇంకొల్లు, మేజర్‌న్యూస్ :
నవంబరు 5వ తేదీన జరగనున్న జడ్పీటీసీ మరియు ఎం.పి.టి.సి ఎన్నికల నిర్వహణలో భాగంగా పి.ఓలకు మరియు ఏ.పి.ఓ ఇంకొల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓటింగ్ నిర్వహణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యవహరించాల్సిన తీరుపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. శిక్షణా కార్యక్రమంలో ఎన్నికల అధికారి కె. రమేష్‌బాబు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి గట్టా శ్రీనివాసరావు, తహశీల్దారు ఏ.వి.యస్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
సూర్య రిపోర్టర్ : షేక్ జానిబాష, ఇంకొల్లు.