BREAKING
కలెక్టరు వాహనాన్ని మద్యం మత్తులో ఢీ కొట్టిన లారీ డ్రైవర్ కు వారం రోజులు జైలుశిక్ష.... బొబ్బిలి మున్సిపల్ ఎన్నికలకు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కఠిన ఆంక్షలు: మంథనిలో పుష్కర ఘాట్ అభివృద్ధికి రూ.23 కోట్లు... ఆకలి కేకల దిశగా ప్రపంచం? విజయనగరం సమగ్ర అభివృద్ధే లక్ష్యం..... బీఎస్పీ మేయర్ అభ్యర్థిని లింగాల పార్వతికి మద్దతుగా ప్రచార ర్యాలీ ఆర్నబ్ తుఫాన్ తో 56 హెక్టార్లలో వరి, 4 హెక్టార్లలో పత్తి నష్టం: ఏవో రాష్ట్రస్థాయి యోగా పోటీలకు డి. ప్రదీప్ ఎంపిక పల్లె పోరులో... ప్రచారాల హోరు నగరంలో ముమ్మరంగా ఎమ్మెల్యే దగ్గుపాటి సతీమణి శ్రీలక్ష్మి, కుమార్తె అశ్రిత ఎన్నికల ప్రచారం.. 45, 48 డివిజన్లలో ప్రచార కార్యక్రమం.. దగ్గుపాటి శ్రీలక్ష్మి కి మహిళల నుంచి అనూహ్య స్పందన క్లోరినేషన్ పరీక్షలు తప్పనిసరి --ఆరోగ్య విస్తరణ అధికారి : ఎల్ . సుబ్రహ్మణ్యం ఆశీర్వదించండి.... మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా రూప్ కుమార్ యాదవ్ కు మద్దతుగా మాదిగల ఆత్మీయ సదస్సు కేసీఆర్‌దే హాలిడే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదు: ఆది శ్రీనివాస్ 4వ డివిజన్‌లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ప్రచారం పత్తి పంటను పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం :

పశుగ్రాస సాగు చేపట్టండి.. నీటి తొట్టెలను పరిశుభ్రంగా ఉంచండి

Select Suryaa Now
పశుగ్రాస సాగు చేపట్టండి.. నీటి తొట్టెలను పరిశుభ్రంగా ఉంచండి

కడ్తాల్, రంగారెడ్డి 

- రైతులకు MAHO డా.భాను నాయక్ సూచన*

ఎల్‌నినో ప్రభావం, రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని రైతులు ముందస్తుగా పశుగ్రాస సాగు చేపట్టాలని కడ్తాల్ మండల పశుసంవర్ధక అధికారి డాక్టర్ భాను నాయక్ కేతావత్ విజ్ఞప్తి చేశారు.

VBG-G RAM G పథకం కింద వ్యక్తిగత రైతులు లేదా రైతు సంఘాలు, సొసైటీలు పశుగ్రాస సాగు చేపట్టి అర్హత, ఆమోదానికి లోబడి రూ.14,000 వరకు ఆర్థిక ప్రయోజనం పొందవచ్చని తెలిపారు. వేసవిలో పచ్చిమేత కొరత రాకుండా ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా సాగు చేయాలని సూచించారు.

అదేవిధంగా మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శులు పశువుల తాగునీటి తొట్టెలను పరిశీలించి ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలన్నారు. వేసవిలో తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని, అదనపు తొట్టెలు అవసరమైతే VBG-G RAM G పథకం కింద మంజూరుకు ప్రతిపాదనలు పంపాలని కోరారు.

రైతులు, పశుపోషకులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేసి పశువుల ఆరోగ్య పరిరక్షణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.