*49వ వార్డు కార్పొరేటర్ అభ్యర్ధి బొడ్డేటి మాధవి కిరణ్ కుమార్ ని అత్యధిక మెజారిటీ తో గెలిపించండి
సీతమ్మధార, సూర్య : జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 49 వార్డులో కార్పొరేటర్ అభ్యర్థి బొడ్డేటి మాధవి కిరణ్ కుమార్ కి మద్దతుగా ఎన్నికల ప్రచార ర్యాలీ జరిగింది. విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు,విశాఖ ఉత్తర నియోజకవర్గ సమయకర్త కె.కె రాజు జీవీఎంసీ మేయర్ అభ్యర్థి వరుదు కల్యాణి పాల్గొన్నారు.ఈ ర్యాలీని ఉద్దేశించి కె.కె రాజు మాట్లాడుతూ 49వార్డు అన్నివిధాల అభివృధి పదంలో నడవాలి అంటే మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి కి, 49 వార్డు కార్పొరేటర్ అభ్యర్థి బొడ్డేటి మాధవి కిరణ్ కుమార్ కి ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలిపారు. మేయర్ అభ్యర్థి వద్దు కళ్యాణి మాట్లాడుతూ విశాఖపట్నం అభివృద్ధి చెందాలంటే వైసిపి ద్వారానే సాధ్యమవుతుందని ఆమె అన్నారు. కూటమి పాలనలో నిత్యవసర ధరలు పెరిగిపోయాయని ఆమె మండిపడ్డారు. సింహాచలం దేవస్థానం భూములు ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని అదేవిధంగా గీతం కాలేజీ భూములను అప్పనంగా దోచుకున్నారని అని అన్నారు మేయర్గా గెలిచిన తర్వాత అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఫారుకి ,వార్డు పరిశీలకులు భోగవల్లి గోవింద్, రేవతిరావు, దేముడు బాబు, పాండవ శ్రీను, విజయ్ పాల్, శేషు, లలితకుమారి, రమాదేవి, గుడియా, జి.లక్ష్మి,సుశీల, నవాబ్, సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.