పరశురామరాజుకు మద్దతుగా ఎంపీ. సీఎం రమేష్ ప్రచారం
సీతమ్మధార, సూర్య : జీవీఎంసీ 54వ వార్డు బిజెపి అభ్యర్థి పరిసరామరాజు విస్తృతంగా వార్డులో ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
దేశంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ కు ప్రజలు మద్దతు ఇచ్చారని, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కుటమి అభ్యర్థులకు మద్దతిచ్చి త్రిబుల్ ఇంజన్ సర్కార్ నడిచే విధంగా ప్రజల సహకరించాలని కోరారు.
పంచ గ్రామాల సమస్య పై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోబోతుందని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో 26,000 మంది పేద ప్రజలకు ఇండ్ల పట్టాలు అందజేయడం జరిగిందని అన్నారు. కొండవాలు ప్రాంతాల్లో ప్రజల సమస్యల అయినటువంటి ఇండ్ల పట్టాలు,రోడ్లు, డ్రైనేజీ, మంచినీళ్లు, కమ్యూనిటీ హల్ వంటి సమస్యలకు పరిష్కారం పరశురామరాజు చూపిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చొక్కాకుల వెంకటరావు, బొడ్డేటి కాశీ విశ్వనాథం, తెలుగుదేశం, బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు.