ప్రచారంలో దూసుకుపోతున్న సిపిఎం అభ్యర్థి
జీలుగుమిల్లి, మేజర్ న్యూస్: మండలంలోని అంకన్న గూడెం ఎంపీటీసీగా పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి కొవ్వాసు రామలక్ష్మి అంకన్న గూడెం తెల్లవరం కాలనీ ఇంటింటా ప్రచారం చేస్తూ ఓటర్ల ను కలిసి సిపిఎం పార్టీకి తమ ఓట్లు వేయాలని కోరారు. సిపిఎం పార్టీ జీలుగుమిల్లి మండల నాయకుడు సిరి బత్తుల సీతారామయ్య మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ గిరిజన హక్కుల కోసం కార్మికుల హక్కుల కోసం పోరాడే సిపిఎం పార్టీ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకే ఓట్లు వేయాలని కోరారు. అంకన్నగూడెం పంచాయతీ ఆర్ అండ్ ఆర్ తెల్లవరం కాలనీలో ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో గుండి గంగరాజు, సోడే కన్నప్ప రాజు, జోగమ్మ, ముచ్చిక చిలకమ్మా తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ బొంతు రామకృష్ణ జీలుగుమిల్లి ఏలూరు జిల్లా,