ఈటల రాజేందర్ పాదయాత్రలో పాల్గొన్న ఎల్లంపేట్ మున్సిపల్ వైస్ చైర్మన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి
కీసర, మేజర్ న్యూస్: జవహర్‌నగర్ డంపింగ్ యార్డును ఎత్తివేయాలని, ప్రజల ఆరోగ్యం, పర్యావరణాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ చేపట్టిన పాదయాత్ర మూడో రోజు కీసరలో కొనసాగింది. ఈ పాదయాత్రలో ఎల్లంపేట్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి పాల్గొని తన మద్దతు తెలిపారు.డంపింగ్ యార్డు సమస్య పరిష్కారం కోసం సాగుతున్న ప్రజా ఉద్యమంలో భాగస్వామ్యమై, స్థానిక ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన డిమాండ్లకు ఆమె సంఘీభావం ప్రకటించారు.