స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ తథ్యం.......... తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి
తిరుపతి
రాష్ట్రవ్యాప్తంగా జరుగనున్న ఎన్నికల్లో ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఒక పండుగ వాతావరణంలో ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకుంటూ సానుకూల సంకేతాలను ఇస్తున్నారని తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన కూటమి పార్టీ ల ప్రెస్ మీట్ లో డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ గత 2019–2024 మధ్య కాలంలో ఉన్న అరాచక పాలన తర్వాత, 2024 ఎన్నికల్లో ప్రజలు 96-97% స్ట్రైక్ రేట్‌తో ఎన్డీఏ కూటమిని గెలిపించారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు నారా లోకేష్ ప్రపంచవ్యాప్తంగా పర్యటించి రాష్ట్రానికి లక్షలాది కోట్ల పెట్టుబడులను తీసుకొస్తున్నారన్నారు.రాష్ట్రంలోని యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లి కుటుంబాలకు దూరంగా ఉండాల్సిన అవసరం లేకుండా, సొంత రాష్ట్రంలోనే పనిచేసుకునేలా అనేక పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.కేవలం విశాఖపట్నం, అమరావతి, తిరుపతి మాత్రమే కాకుండా ప్రతి జిల్లాను ఒక ఇండస్ట్రియల్ హబ్‌గా మారుస్తున్నారు. శ్రీసిటీలో ఎల్‌జీ, రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి సంస్థల ద్వారా లక్షలాది మందికి ఉపాధిని కల్పిస్తున్నారన్నారు.చదువుకున్న యువత రాజకీయాల్లోకి వస్తే వ్యవస్థ బాగుంటుందనే నారా లోకేష్ , పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దల ఆలోచన మేరకు ఎన్డీఏ కూటమి యువతకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిదన్నారు.తిరుపతి కార్పొరేషన్‌లోని 66 డివిజన్లలో సుమారు 70% సీట్లను యువతకే కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల పదవుల్లోనూ యువతకు అవకాశం కల్పించారని తెలిపారు.మహిళల చురుకుదనం, జ్ఞానాన్ని గుర్తించి వారికి అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు కేటాయించడం జరిగిందని,రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళలకు మరిన్ని సీట్లు లభిస్తాయి అని అన్నారు.70 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న శెట్టిపల్లె భూ వివాదాన్ని సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే పరిష్కరించామని,తుడాకు లభించిన సుమారు 566 ఎకరాల భూమి ద్వారా ఇబ్బంది పడుతున్న 2,000 మందికి పైగా లబ్ధిదారులకు న్యాయం చేశామని తెలిపారు.శెట్టిపల్లె వద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించబోతున్నారు. అక్కడే 90 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్లు, స్టార్ హోటళ్లు, స్కూళ్లు, హాస్పిటల్స్‌తో కూడిన మెగా టౌన్‌షిప్ రాబోతోందన్నారు.గతంలో 3-4 కి.మీ పరిధిలో ఉన్న తిరుపతి నగరాన్ని 10 కి.మీ పరిధికి విస్తరించామని,తుడా తరపున రూ. 250 కోట్ల బడ్జెట్‌తో 22 కిలోమీటర్ల మేర మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మించి ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేశారు. తిరుపతిని మల్టీ సిటీగా, కన్వెన్షన్, వెడ్డింగ్ మరియు స్పిరిచువల్ డెస్టినేషన్‌గా అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు.కొరమేనుగుంటలో రూ. 1 కోటితో, సింగలగుంటలో డ్రైనేజీ పనులు చేపట్టి, శ్రీకాళహస్తి ఆలయ నాలుగు మాడ వీధుల్లో రూ. 7.5 కోట్లతో నాయుడుపేట మెయిన్ రోడ్డులో తుడా నిధులతో డ్రైనేజీ నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు.వర్షాలకు తిరుపతి మునిగిపోకుండా రూ. 110 కోట్లతో అవిలాల చెరువు పునరుద్ధరణ చేపట్టి, మొదటి విడతగా రూ. 30 కోట్లతో టెండర్లు పిలిచామని,'సిటీ ఆఫ్ లేక్స్'లో భాగంగా తిరుపతి అర్బన్, రూరల్ పరిధిలోని 24 చెరువులను అనుసంధానించి భూగర్భ జలాలు పెంచేందుకు జర్మనీకి చెందిన కెఎఫ్‌డబ్ల్యూ బ్యాంక్ ద్వారా తుడా చరిత్రలోనే తొలిసారిగా రూ. 750 కోట్లు తీసుకొస్తామన్నారు.చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల్లో ప్రచారానికి వెళ్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కూటమి చేసిన అభివృద్ధి చూసే ఓటు వేస్తామని మహిళలు, యువత, ఉద్యోగులు, రైతులు సంతోషంగా చెపుతున్నారని తెలిపారు.తిరుపతి మేయర్ అభ్యర్థి జె.బి. శ్రీనివాస్ ని, 66 వార్డుల కార్పొరేటర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, జడ్పీ ఛైర్మన్ ఎన్నికల్లో 100% సీట్లను, అలాగే త్వరలో రాబోయే సర్పంచ్ ఎన్నికల్లోనూ ప్రతి పంచాయతీలో ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా డాలర్స్ దివాకర్ రెడ్డి, తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు పనబాక లక్ష్మి,జనసేన అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ , భాజపా తిరుపతి అధ్యక్షుడు సామాంచి శ్రీనివాస్ పాల్గొన్నారు.