BREAKING
ఉధృతంగా ప్రవహిస్తున్న గోముఖీ, సువర్ణముఖి నదులు మునిసిపల్ ఎన్నికలపై జిల్లా ఎస్పీ సమీక్ష మూడో త్రైమాసికంలో 77 శాతం ఎగబాకిన బోలిడెన్ లాభాలు! బీసీ కుల సంఘాలు, కులవృత్తిదారుల ఆత్మీయ సదస్సు ఎన్నికల నిర్వహణపై పి.ఓలకు, ఏ.పి.ఓలకు శిక్షణ కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న బీఆర్‌ఎస్ నేతలు *49వ వార్డు కార్పొరేటర్ అభ్యర్ధి బొడ్డేటి మాధవి కిరణ్ కుమార్ ని అత్యధిక మెజారిటీ తో గెలిపించండి పరశురామరాజుకు మద్దతుగా ఎంపీ. సీఎం రమేష్ ప్రచారం షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వర్కర్లకు దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శంకర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ తథ్యం.......... తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్న సిపిఎం అభ్యర్థి ప్రశాంతయుతంగా ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు ముందస్తు చర్యలు చేపట్టాం అమెరికాలో ఇన్‌స్టాకార్ట్‌ను కొనుగోలు చేసిన డోర్‌డాష్! ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ అభ్యర్థులు- వెనుకబడిన వైసీపీ శ్రేణులు! ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి

జనగణనలో ఓబీసీ కాలమ్ తప్పనిసరిగా చేర్చాలి మంత్రి పొన్నం ప్రభాకర్

Select Suryaa Now
జనగణనలో ఓబీసీ కాలమ్ తప్పనిసరిగా చేర్చాలి మంత్రి పొన్నం ప్రభాకర్


 

దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణనలో కులగణనను కూడా చేపట్టి, ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీలకు ప్రత్యేక కాలమ్‌ను తప్పనిసరిగా చేర్చాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సచివాలయంలో రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమై ఈ అంశంపై చర్చించారు. గతంలో జనగణనలో కులగణన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఆగస్టు 14న వెల్లడించిన 40 ప్రశ్నల వివరాల్లో ఎస్సీ, ఎస్టీ, ఇతరులు అనే విభాగాలు మాత్రమే ఉన్నాయని, ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ లేదని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించకపోతే బీసీల వాస్తవ జనాభా ఎంత అనేది స్పష్టంగా తెలియదని అన్నారు.
రిజర్వేషన్ల పెంపునకు కచ్చితమైన గణాంకాలు అవసరం
రిజర్వేషన్లను 50 శాతానికి మించి పెంచాలని కోరిన సందర్భాల్లో న్యాయస్థానాలు కచ్చితమైన కులాల వారీ జనాభా గణాంకాలను (ఎంపైరికల్ డేటా) అడుగుతున్నాయని మంత్రి వివరించారు. జనగణనలో ఓబీసీ కాలమ్‌ను చేర్చితే బీసీల జనాభాపై స్పష్టమైన సమాచారం లభిస్తుందని, ఆ గణాంకాల ఆధారంగా చట్టసభల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం, రిజర్వేషన్ల పెంపు, బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అమలు సులభతరమవుతాయని తెలిపారు.
అమిత్ షాను కలిసి వినతి చేయాలి
2011 తర్వాత ప్రస్తుతం జనగణన నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో, ఈసారి కులగణనలో ఓబీసీలను తప్పనిసరిగా చేర్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పొన్నం ప్రభాకర్ కోరారు. తెలంగాణ శాసనసభ ఇప్పటికే జనగణనలో కులగణనను చేర్చాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని గుర్తుచేశారు. త్వరలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీసీ సంఘాల ప్రతినిధులను ఏకతాటిపైకి తీసుకురావాలని ఆర్. కృష్ణయ్యకు మంత్రి సూచించారు. జనగణనలో ఓబీసీ కాలమ్‌ను చేర్చాలనే ఏకైక డిమాండ్‌తో అమిత్ షాను కలిసి వినతిపత్రం సమర్పించాలని కోరారు.
బీసీలకు సామాజిక న్యాయం కల్పించాలన్నా, వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా అవకాశాలు, నిధులు అందించాలన్నా కచ్చితమైన జనాభా గణాంకాలు కీలకమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
ఎ.రవీందర్‌ సూర్య తెలంగాణ బ్యూరో ప్రతినిధి