BREAKING
బీసీ కుల సంఘాలు, కులవృత్తిదారుల ఆత్మీయ సదస్సు ఎన్నికల నిర్వహణపై పి.ఓలకు, ఏ.పి.ఓలకు శిక్షణ కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న బీఆర్‌ఎస్ నేతలు *49వ వార్డు కార్పొరేటర్ అభ్యర్ధి బొడ్డేటి మాధవి కిరణ్ కుమార్ ని అత్యధిక మెజారిటీ తో గెలిపించండి పరశురామరాజుకు మద్దతుగా ఎంపీ. సీఎం రమేష్ ప్రచారం షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వర్కర్లకు దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శంకర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ తథ్యం.......... తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్న సిపిఎం అభ్యర్థి ప్రశాంతయుతంగా ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు ముందస్తు చర్యలు చేపట్టాం అమెరికాలో ఇన్‌స్టాకార్ట్‌ను కొనుగోలు చేసిన డోర్‌డాష్! ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ అభ్యర్థులు- వెనుకబడిన వైసీపీ శ్రేణులు! ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి స్థానిక ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి ​డోన్ డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాళ్లను పరిశీలించిన కలెక్టర్ రాజకుమారి *అయిజలో నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం: ఏడీఈ నీలి గోవిందు* రక్షణ రంగంలో దూసుకెళ్తున్న ఇంద్ర గ్రూప్

జోరు వానలోనూ వైయస్సార్సీపి ప్రచార హోరు

Select Suryaa Now
జోరు వానలోనూ వైయస్సార్సీపి  ప్రచార హోరు

నరసన్నపేట, సూర్య : వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నరసన్నపేట పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. పట్టణంలోని ఎంపీటీసీ-5 పరిధి సంతతోట, ఎంపీటీసీ-4 పరిధి లచ్చుమనుపేట ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మద్దతుగా యువ నాయకుడు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తూ.. ‘ఫ్యాన్ గుర్తుకే మన ఓటు.. వైఎస్సార్‌సీపీకే మన మద్దతు’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య మాట్లాడుతూ, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రచారంలో పాల్గొంటున్న నాయకులు, కార్యకర్తల ఉత్సాహం అభినందనీయమన్నారు. ప్రజల ఆశీస్సులతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసేలా ఓటర్లకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర కళింగ విభాగం అధ్యక్షుడు ఆరంగి మురళీధర్, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు కేఎస్‌హెచ్ గుప్తా, రాష్ట్ర కార్యదర్శి బురల్లి శంకరరావు, రఘు పాత్రుని శ్రీధర్, నియోజకవర్గ కళింగ వైశ్య విభాగం అధ్యక్షుడు వైశ్యరాజు కేశవరాజు, మండల యువజన విభాగం అధ్యక్షుడు బుద్దల రాజశేఖర్, మండల ఉపాధ్యక్షుడు నేతింటి రాజేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు పొట్నూరు సాయిప్రసాద్, మాజీ ఎంపీటీసీ మార్పు విజయ్, పట్ట ఠాగూర్, చీపురు నారాయణ, ముద్దాడ గోవిందరావు, తంగుడు తులసీదాస్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : గోపాల్ కృష్ణ, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా.