స్థానిక ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి డోన్ డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాళ్లను పరిశీలించిన కలెక్టర్ రాజకుమారి
డోన్ సూర్య ప్రతినిధి రూరల్, :స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. గురువారం డోన్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్ రూమ్, రిసెప్షన్ సెంటర్, ఓట్ల లెక్కింపు కేంద్రాలను (కౌంటింగ్ హాళ్లు) ఆమె క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో కల్పిస్తున్న మౌలిక వసతులు, పటిష్టమైన భద్రతా చర్యలతో పాటు రిసెప్షన్ సెంటర్‌లో కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది, అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సమర్థవంతంగా పూర్తి చేయాలని చెప్పారు.
సూర్య ప్రతినిధి తారక్ నంద్యాల జిల్లా డోన్