భారీ మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తాం: బీసీ సంఘం నేతలు
నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్‌కు బీసీ సంక్షేమ సంఘం మద్దతు ప్రకటించింది. ఆయన విజయానికి కృషి చేస్తామని సంఘం నాయకులు పిలుపునిచ్చారు. నెల్లూరులోని హోటల్ శివం ఇంటర్నేషనల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ బీదా మస్తాన్‌రావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్‌కు మద్దతు తెలిపినట్లు నాయకులు వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో రూప్ కుమార్ యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపించేందుకు బీసీ సంఘం శ్రేణులు కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.