BREAKING
మునిసిపల్ ఎన్నికలపై జిల్లా ఎస్పీ సమీక్ష మూడో త్రైమాసికంలో 77 శాతం ఎగబాకిన బోలిడెన్ లాభాలు! బీసీ కుల సంఘాలు, కులవృత్తిదారుల ఆత్మీయ సదస్సు ఎన్నికల నిర్వహణపై పి.ఓలకు, ఏ.పి.ఓలకు శిక్షణ కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న బీఆర్‌ఎస్ నేతలు *49వ వార్డు కార్పొరేటర్ అభ్యర్ధి బొడ్డేటి మాధవి కిరణ్ కుమార్ ని అత్యధిక మెజారిటీ తో గెలిపించండి పరశురామరాజుకు మద్దతుగా ఎంపీ. సీఎం రమేష్ ప్రచారం షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వర్కర్లకు దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శంకర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ తథ్యం.......... తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్న సిపిఎం అభ్యర్థి ప్రశాంతయుతంగా ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు ముందస్తు చర్యలు చేపట్టాం అమెరికాలో ఇన్‌స్టాకార్ట్‌ను కొనుగోలు చేసిన డోర్‌డాష్! ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ అభ్యర్థులు- వెనుకబడిన వైసీపీ శ్రేణులు! ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి స్థానిక ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి ​డోన్ డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాళ్లను పరిశీలించిన కలెక్టర్ రాజకుమారి

జోరువానలోనూ వైఎస్సార్‌సీపీ ప్రచార జోరు

Select Suryaa Now
జోరువానలోనూ వైఎస్సార్‌సీపీ ప్రచార జోరు

గార, సూర్య : తుపాను ప్రభావంతో వర్షం కురుస్తున్నప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. గార మండలం నిజామాబాద్ పంచాయతీలో బుధవారం సాయంత్రం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, యువ నాయకుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు పాల్గొని జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మహిళలు, యువత, రైతులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కూటమి హామీల అమలులో విఫలమైంది: ధర్మాన రామ్ మనోహర్ నాయుడు

ఈ సందర్భంగా ధర్మాన రామ్ మనోహర్ నాయుడు మాట్లాడుతూ.. ఫ్యాన్ గుర్తుకు ఎందుకు ఓటు వేయాలి, సైకిల్ గుర్తుకు ఎందుకు వేయకూడదో ప్రజలే నిర్ణయించుకోవాలని అన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఎన్నికల్లో ఓట్లు పొందిన తర్వాత ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ఆరోపించారు. కూటమి పాలనలో నాయకులు మాత్రమే ప్రయోజనం పొందుతున్నారని, ప్రజలు, మహిళలు, యువత ఆశించిన ప్రయోజనాలు పొందలేకపోతున్నారని విమర్శించారు.

యువతకు ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు లభించడం లేదని, రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, యూరియా సరఫరాపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇసుక, మట్టి అక్రమాలు, అవినీతిపై ప్రజల్లో ఆందోళన ఉందని ఆరోపించారు. ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను ప్రశ్నించే వారిపై దాడులు, కేసులు, బెదిరింపులు, కక్షసాధింపు చర్యలు జరుగుతున్నాయని విమర్శించారు.

ఆత్మాభిమానం కోసమే వైఎస్సార్‌సీపీలో చేరా: గుండ లక్ష్మీదేవి

మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ.. తమ కుటుంబానికి రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉందని, కుటుంబ సభ్యులు గతంలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేశారని గుర్తుచేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ టికెట్ లభించకపోయినా తాము బాధపడలేదని, అయితే ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు తమను ఆహ్వానించకపోవడం, తమ కుటుంబం పట్ల వ్యవహరించిన తీరు తీవ్ర మానసిక వేదనకు గురిచేసిందని తెలిపారు.

తమకు అన్యాయం జరిగిందనే భావనతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పదవులు కొత్త కాదని, పదవుల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరానంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఆత్మాభిమానం కోసమే వైఎస్సార్‌సీపీలో చేరినట్లు పేర్కొన్నారు.

ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అభ్యర్థులను గెలిపించండి

నిజామాబాద్ పంచాయతీ పరిధిలో జడ్పీటీసీ అభ్యర్థి పీస శ్రీహరి, ఎంపీటీసీ అభ్యర్థి రాంబాయిని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గుండ లక్ష్మీదేవి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రామారావు, కొయ్యన నాగభూషణ్, ముంజేటి కృష్ణ, పెద్దబాబు, జల్లు రాజీవ్, మండల పార్టీ ముఖ్య నాయకులు, నిజామాబాద్ పంచాయతీ నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలు, మహిళలు, యువత, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : గోపాల్ కృష్ణ, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా.