BREAKING
జోరుగా గడప గడపకు వైసిపి అభ్యర్థులు ప్రచారం మత్స్యకారులకు అండగా ప్రభుత్వం నేటి నుండి టిడిపి జడ్పిటిసి అభ్యర్థి ప్రచారం ప్రారంభం చీరాల సబ్‌ డివిజన్‌ పరిధిలోని అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన యూఎస్ ఫెడరల్ రిజర్వ్.. 10-2 ఓట్ల తేడాతో కీలక నిర్ణయం! భారీ వర్షాల నేపథ్యంలో 300 మందికి సురక్షిత ఆశ్రయం సోలార్ ఎనర్జీ సేవలు ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ సీఎం సురేష్* పేదింటి ఆడపడుచు పెళ్లికి సర్పంచ్ కానుక శభాస్ సంపత్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు... హెలెన్ కన్సమ్షన్ ఖర్చులపై ద్రవ్యోల్బణ ప్రభావం నీటిలో మునిగిపోయిన పంటలను పరిశీలించిన....డాక్టర్ జి జోగి నాయుడు. గుడ్లూరు చెరువు చెక్ పోస్ట్ వద్ద ఎస్.ఎస్.టి (SST) తనిఖీలను ఆకస్మికంగా పరిశీలించిన జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి ఉధృతంగా ప్రవహిస్తున్న గోముఖీ, సువర్ణముఖి నదులు మునిసిపల్ ఎన్నికలపై జిల్లా ఎస్పీ సమీక్ష

కూటమి జడ్పీటీసీ అభ్యర్థి బలగ ప్రవీణ్ కుమార్ ప్రచార జోరు

Select Suryaa Now
కూటమి జడ్పీటీసీ అభ్యర్థి బలగ ప్రవీణ్ కుమార్ ప్రచార జోరు

నరసన్నపేట, సూర్య : నరసన్నపేట మండల కూటమి జడ్పీటీసీ అభ్యర్థి బలగ ప్రవీణ్ కుమార్ గురువారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. స్థానిక ఎంపీటీసీ అభ్యర్థి నేతింటి అనురాధ, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పట్టణంలోని గాంధీనగర్‌ 1, 2వ వీధుల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కూటమి నేతలంతా సమష్టిగా ప్రచారంలో పాల్గొనడంతో ఎన్నికల సందడి నెలకొంది. ఈ సందర్భంగా బలగ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, కూటమి అభ్యర్థిగా తనను ఆదరించి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. నరసన్నపేట మండలంలోని స్థానిక సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అవినీతికి తావులేని రాజకీయాలు చేయడం, ప్రజల అవసరాలకు నిరంతరం అందుబాటులో ఉండటమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కూటమి అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

రిపోర్టర్ : గోపాల్ కృష్ణ, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా.