లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన పోలీసులు..
శ్రీకాకుళం, సూర్య : తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాతో పాటు ఎగువ ప్రాంతమైన ఒడిశా రాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నాగావళి, వంశధార, బహుదా, మహేంద్ర తనయ నదుల పరివాహక ప్రాంతాల్లో వరద నీరు చేరుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు గురువారం జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. వరద ప్రభావానికి గురయ్యే లోతట్టు ప్రాంతాలను ముందుస్తు గుర్తించి, ఆయా ప్రాంతాల ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేస్తున్నారు.ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ప్రజలు వరద నీటి ప్రవాహాలను దాటకుండా, ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా చర్యలు చేపడుతున్నారు. అవసరమైన ప్రాంతాల్లో కటాఫ్ పాయింట్లు ఏర్పాటు చేసి, రాకపోకలను నియంత్రిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తున్నారు. నదులు, వాగులు, కాలువల వద్దకు వెళ్లవద్దు అని, వరద నీరు ప్రవహిస్తున్న రహదారులను దాటేందుకు ప్రయత్నించవద్దు,పోలీసు, రెవెన్యూ అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు.వరద ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండి, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి అని కోరారు. వర్షాలు కారణంగా నేల కురిగిన చెట్లును తొలిగించి తక్షణ చర్యలు చేపట్టడం జరుగుతుంది.
రిపోర్టర్ : గోపాల్ కృష్ణ, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా.