కామారెడ్డిలో నూతన ఆధార్ సేవా కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతన ఆధార్ సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురువారం ప్రారంభించారు. రాష్ట్రంలోని పద్నాలుగు జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రాల్లో కామారెడ్డి పన్నెండో స్థానంలో నిలిచిందని తెలిపారు. హైదరాబాద్ ప్రాం తీయ కార్యాలయానికి అనుబంధంగా పనిచేసే ఈ కేంద్రం ద్వారా ఆధార్ నమోదు, వివరాల సవరణ, ఫిర్యాదుల పరిష్కారం, నిలిపివేయబడిన నంబర్ల సమస్యల పరిష్కారం వంటి ప్రత్యేక సేవలు అం దుబాటులో ఉంటాయని కలెక్టర్ పేర్కొన్నారు. గ తంలో ప్రత్యేక సేవల కోసం హైదరాబాద్‌కు వెళ్లా ల్సి వచ్చేదని, ఇప్పుడివి జిల్లాలోనే అందుబాటు లోకి రావడంతో ప్రజలకు సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా అవుతాయని తెలిపారు. ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.