BREAKING
వైసిపి అభ్యర్థులపై పూల వర్షం కురిపిస్తూ.. ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు. కూటమి జడ్పీటీసీ అభ్యర్థి బలగ ప్రవీణ్ కుమార్ ప్రచార జోరు అందుకే శ్రీనిధి శెట్టి పాదాలకు దండం పెట్టా.. ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన దర్శకుడు త్రివిక్రమ్! జోరువానలోనూ వైఎస్సార్‌సీపీ ప్రచార జోరు భారీ మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తాం: బీసీ సంఘం నేతలు వరంగల్- ఖమ్మం- నల్గొండ.... పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి.. ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. 'మెగావర్స్' టాక్ షో ఏ ప్లాట్‌ఫామ్‌లో రానుందో తెలుసా? లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన పోలీసులు.. జనగణనలో ఓబీసీ కాలమ్ తప్పనిసరిగా చేర్చాలి మంత్రి పొన్నం ప్రభాకర్ నిత్య అన్నదాన పథకానికి విరాళం జోరు వానలోనూ వైయస్సార్సీపి ప్రచార హోరు 'అనిమల్' రణ్‌బీర్ కంటే 'ధురందర్' రణ్‌వీర్ నటనకే నా ఓటు.. వరుణ్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు! కడపలో వైసీపీ ఎన్నికల ప్రచారం ఉధృతం విడవలూరు టీడీపీ కంచుకోట అని మరోసారి నిరూపించండి: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఇద్దరూ లేకుండా ‘తను వెడ్స్ మను 3’ లేదు.. కొత్త తారలతో సినిమా ప్రచారాన్ని ఖండించిన ఆనంద్ ఎల్ రాయ్!

గండిగూడెంలో కూటమి అభ్యర్థుల ఇంటింటా ప్రచారం ఎంపీటీసీ-2 అభ్యర్థి శీలం వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ అభ్యర్థి కూరపాటి సుజాతకు మద్దతుగా ప్రచారం

Select Suryaa Now
గండిగూడెంలో కూటమి అభ్యర్థుల ఇంటింటా ప్రచారం ఎంపీటీసీ-2 అభ్యర్థి శీలం వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ అభ్యర్థి కూరపాటి సుజాతకు మద్దతుగా ప్రచారం

టి.నరసాపురం, మేజర్ న్యూస్:ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం గండిగూడెం గ్రామంలో కూటమి అభ్యర్థులు శీలం వెంకటేశ్వరరావు, కూరపాటి సుజాతకు మద్దతుగా కూటమి నాయకులు, కార్యకర్తలు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఎంపీటీసీ-2 కూటమి అభ్యర్థి శీలం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వాదం, ఆదరణతో ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో ఎన్నికల బరిలో నిలిచానని తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తానని పేర్కొన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా కలుసుకుంటూ వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నానని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గండిగూడెం గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు తనకు అందిస్తున్న సహకారం ఎంతో ఉత్సాహాన్నిస్తోందని, రానున్న ఎన్నికల్లో తనకు మద్దతు అందించాలని ఓటర్లను కోరారు.ఈ ప్రచార కార్యక్రమంలో జగ్గవరం మాజీ సర్పంచ్ వెలిది నాగబాబు, టి.నరసాపురం సొసైటీ అధ్యక్షుడు జోనబోయిన సోంబాబుఅద్దంకి జగ్గారావు,చాట్రాతి యుగంధర్,చింతలపూడి నవీన్,పబ్బు జయరాజు,యువరాజు, నోములు గణేష్,కాలినీడి వాసు,చక్రి,నాగార్జున, పింగుల మధు,నాజర్ పాషా,సంక్రాంతి సతీష్, సాయిలు ప్రసాద్,తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.