telangana
ఈస్గాం పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ
సూర్య కాగజ్‌నగర్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఈస్గాం పోలీస్‌స్టేషన్‌ను గురువారం జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, సిబ్బంది విధుల నిర్వహణను పరిశీలించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను ఓపికగా విని చట్టపరిధిలో సత్వర న్యాయం అందించాలని సూచించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.అక్రమ గంజాయి రవాణా, విక్రయాలు, నిషేధిత పదార్థాల అక్రమ రవాణా, జూదం, సట్కా మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచి, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గ్రామస్థాయిలో పోలీస్–ప్రజల మధ్య సత్సంబంధాలను పెంపొందిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.