తడగొండ వార్డు సభ్యుడు జగదీష్ వర్ధన్ కు జిల్లా ఉపాధ్యక్ష బాధ్యతలు
సూర్య ..బోయినపల్లి తెలంగాణ రాష్ట్ర వార్డు సభ్యుల సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షునిగా బోయినపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన కట్ట జగదీష్ వర్ధన్ నియమితులయ్యారు.
తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు అతికేం రాజశేఖర్ గౌడ్ కి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో వార్డు సభ్యుల హక్కులపై పోరాటం చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో దయ్యాల రాజశేఖర్, చెట్టు కింద చంద్రశేఖర్, కట్ట నర్సింగం, కట్ట బాబు, కన్నం లక్ష్మణ్, కంబాల ఐలయ్య, కట్ట బాలములయ్య తదితరులు పాల్గొన్నారు.