BREAKING
వైసిపి అభ్యర్థులపై పూల వర్షం కురిపిస్తూ.. ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు. కూటమి జడ్పీటీసీ అభ్యర్థి బలగ ప్రవీణ్ కుమార్ ప్రచార జోరు అందుకే శ్రీనిధి శెట్టి పాదాలకు దండం పెట్టా.. ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన దర్శకుడు త్రివిక్రమ్! జోరువానలోనూ వైఎస్సార్‌సీపీ ప్రచార జోరు భారీ మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తాం: బీసీ సంఘం నేతలు వరంగల్- ఖమ్మం- నల్గొండ.... పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి.. ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. 'మెగావర్స్' టాక్ షో ఏ ప్లాట్‌ఫామ్‌లో రానుందో తెలుసా? లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన పోలీసులు.. జనగణనలో ఓబీసీ కాలమ్ తప్పనిసరిగా చేర్చాలి మంత్రి పొన్నం ప్రభాకర్ నిత్య అన్నదాన పథకానికి విరాళం జోరు వానలోనూ వైయస్సార్సీపి ప్రచార హోరు 'అనిమల్' రణ్‌బీర్ కంటే 'ధురందర్' రణ్‌వీర్ నటనకే నా ఓటు.. వరుణ్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు! కడపలో వైసీపీ ఎన్నికల ప్రచారం ఉధృతం విడవలూరు టీడీపీ కంచుకోట అని మరోసారి నిరూపించండి: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఇద్దరూ లేకుండా ‘తను వెడ్స్ మను 3’ లేదు.. కొత్త తారలతో సినిమా ప్రచారాన్ని ఖండించిన ఆనంద్ ఎల్ రాయ్!

కూటమి పాలనలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి

Select Suryaa Now
కూటమి పాలనలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి

అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : కూటమి పాలనలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతుందటంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పడుతూ ఇబ్బందులు పడుతున్నా వాటిని నియంత్రించడంలో కూటమి నేతలు పూర్తిగా వైఫల్యం చెందారని మాజీ మేయర్ మహమ్మద్ వసీం విమర్శించారు.నగరంలోని 22,45 వ డివిజన్ ల వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులు ఐశ్వర్య,అనిల్ కుమార్ రెడ్డి, మేయర్ అభ్యర్ధి చిట్లూరి రమేష్ లను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను ఆయన కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో అభిరుద్ది, ప్రజా సంక్షేమాన్నీ పూర్తిగా పక్కన పెట్టేశారన్నారు.గత వైసీపీ పాలనలో ప్రతి నెలా ఎదో ఒక సంక్షేమ పథకాల నగదు డిపిటి ద్వారా ప్రజల ఖాతాలలో పడేవన్నారు.

అయితే ఎన్నికల ముంగిట వీటికి  రెట్టింపును ఇస్తామని హామీ ఇచ్చి వాటిని అమలు చేయక పోవడంతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.ఒక వైపు పెరిగిన ధరలు, మరోవైపు సంక్షేమ పథకాల నగదు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.వీటన్నింటినీ గమనించి ఓటు ద్వారా కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఆయన సూచించారు. అదే విధంగా డివిజన్ల అభివృద్ధి కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైసీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఆయన  ప్రజలను కోరారు.కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్