దౌలాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ దుర్మరణం
యాలాల (మేజర్ న్యూస్): యాలాల మండలం దౌలాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. టీజీ 06 బి 6974 నంబరు గల ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురైంది. సమాచారం అందుకున్న యాలాల పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. మృతుడి వివరాలు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.