కూటమి ప్రభుత్వం రైతులను అన్ని విధాల ఆదుకుంటుంది
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హామీ ఇచ్చారు. గురువారం జేగురుపాడు, కడియం ,మాధవరాయుడుపాలెం గ్రామాల్లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టాన్ని ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. రైతులకు ధైర్యం చెప్పారు. వరి కోత దశలో తుఫాన్ రావడం దురదృష్టం అని ఇలాంటి విపత్తులను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుంది అన్నారు. తుఫాన్ ముందే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను అప్రమత్తం చేశారని, రేయింబవళ్లు సమీక్షిస్తూ ప్రాణ నష్టాలు లేకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారన్నారు. ప్రకృతి వైపరీత్యాన్ని ఎవరు అడ్డుకోలేమని, తగిన జాగ్రత్తల ద్వారా మాత్రమే మనం నష్టాన్ని అధిగమించగలమని పేర్కొన్నారు. ఉద్యానవన,వరి పంటల రైతులు భారీగా నష్టపోయారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి నేరుగా రైతు ఎకౌంట్లకే నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన వెంట కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు.