బ్రెయిన్ ఎటాక్ నుంచి ప్రాణాలు కాపాడే సరికొత్త రక్షణ కవచం
ఆరిలోవ, సూర్య : "గుండెపోటు వస్తే ఎంత వేగంగా ఆసుపత్రికి పరుగెడతామో.. బ్రెయిన్ ఎటాక్ (పక్షవాతం) విషయంలోనూ అంతే మెరుపు వేగంతో స్పందించాలి. మెదడులో రక్తం గడ్డకట్టిన ప్రతి మినిట్ కు లక్షలాది నాడులు నిస్తేజమైపోతాయి." ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం 2026 ప్రతి నిమిషం విలువైనదని పిలుపు తో పక్షవాతాన్ని మొదట్లోనే తుదముట్టించేందుకు ఎం.జి.ఎం సెవెన్ హిల్స్ హాస్పిటల్ సరికొత్త 24/7 అత్యవసర స్ట్రోక్ యూనిట్ ను ప్రారంభించింది. ప్రముఖ సీనియర్ న్యూరాలజిస్టులు డా. ఆర్. వి. నారాయణ, డా. ప్రదీప్ కాకరాల, ప్రముఖ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డా. ప్రదీప్ జి.వి.ఎన్., సీనియర్ న్యూరోసర్జన్లు డా. పి. ఎం. జగన్నాథ్, డా. మురళీకృష్ణ ప్రజలకు కీలక సందేశమిచ్చారు: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో విపరీతమైన పని ఒత్తిడి, నిద్రలేమి, బీపీ కారణంగా 30 ఏళ్ల లోపు యువత కూడా పక్షవాతం బారినపడుతున్నారు. అయితే, స్ట్రోక్ లక్షణాలు కనిపించిన వెంటనే ‘గోల్డెన్ అవర్’లో రోగిని ఆసుపత్రికి తీసుకువస్తే, వారిని మళ్లీ నడిపించవచ్చు, సాధారణ జీవితాన్ని ఇవ్వవచ్చు ఈ ప్రాణరక్షక వ్యవస్థలో న్యూరాలజిస్టులు, న్యూరోసర్జన్లు, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టులు, ఎమర్జెన్సీ ఫిజీషియన్లు, క్రిటికల్ కేర్ ఫిజీషియన్లతో కూడిన నిపుణులైన స్ట్రోక్ టీమ్ నిరంతరం పహారా కాస్తుంది. వైద్యుల వేగవంతమైన నిర్ణయాలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి ఎమర్జెన్సీ సాంకేతికతను జోడించామని సీవోవో ఎం.వి. మహేంద్ర రెడ్డి తెలిపారు.
రిపోర్టర్ : శ్రీనివాస్, అరిలోవా, విశాఖపట్నం.