29వ వార్డులో కేడిమి సుమలత ప్రచార జోరు - మహిళల అండతో దూసుకెళ్తున్న టీడీపీ
రాయదుర్గం టౌన్ మేజర్ న్యూస్: రాయదుర్గం మున్సిపాలిటీ 29వ వార్డు టీడీపీ - కూటమి కౌన్సిలర్ అభ్యర్థి కేడిమి సుమలత ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు,బుధవారం వార్డులోని ప్రతి వీధి, ప్రతి ఇంటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను మరియు చైర్మన్ అభ్యర్థి టంకశాల హనుమంతు ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కూటమి ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు,మహిళా సంక్షేమమే లక్ష్యం...ఈ సందర్భంగా కేడిమి సుమలత మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నారని, దీపం పథకం ద్వారా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి లాంటి పథకాలతో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారని తెలిపారు,తనను గెలిపిస్తే వార్డులోని ప్రతి సమస్యను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాల సమస్యలు లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు,ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ వలీ భాష, జిలాన్ భాష, కడ్డీపూడి మహబూబ్ భాష, కేడిమి తిప్పేస్వామి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు,
సూర్య ప్రతినిధి: మహేష్ రాయదుర్గం టౌన్ .