BREAKING
కంబాలపల్లి ఎంపీటీసీగా తిక్కమ్మనేని మంజుల ఏకగ్రీవం కూటమి పాలనలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి గండిగూడెంలో కూటమి అభ్యర్థుల ఇంటింటా ప్రచారం ఎంపీటీసీ-2 అభ్యర్థి శీలం వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ అభ్యర్థి కూరపాటి సుజాతకు మద్దతుగా ప్రచారం ఎల్నినో ప్రభావంతో నీటి పొదుపునకు ప్రాధాన్యం మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి. కూటమి ప్రభుత్వం రైతులను అన్ని విధాల ఆదుకుంటుంది ఎమ్మెల్యే దగ్గుపాటి ఆధ్వర్యంలో దోపిడీ పాలన ఈస్గాం పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ అనకాపల్లి జిల్లాలో"ఆర్నాబ్" తుఫాను సహాయక చర్యల కోసం రూ. 2,05,50,000/- ముందస్తు నిధుల విడుదల తడగొండ వార్డు సభ్యుడు జగదీష్ వర్ధన్ కు జిల్లా ఉపాధ్యక్ష బాధ్యతలు సలుగుపల్లిలో వృథాగా పోతున్న మిషన్ భగీరథ నీళ్లు! - పట్టించుకోని సిబ్బంది.. దౌలాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్‌ దుర్మరణం ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే పాటించి దోమల సమాజాన్ని నిర్మిద్దాం తుఫాన్ సహాయ చర్య లో పాల్గొన్న అధికారులు దాడానగర్‌లో కొమురం భీం వర్ధంతి బంగారు, వెండి ఆభరణాల చోరీకి పాల్పడిన నిందితుడి అరెస్ట్

టామ్‌కామ్‌ను టామ్ స్కామ్‌గా మార్చారు : ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన ఫీజులు తిరిగి చెల్లించాలి

Select Suryaa Now
టామ్‌కామ్‌ను టామ్ స్కామ్‌గా మార్చారు : ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్,                                                     నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన ఫీజులు తిరిగి చెల్లించాలి

 

సూర్య బ్యూరో ప్రతినిధి : విదేశీ ఉద్యోగాల కల్పన పేరుతో నిరుద్యోగులను మోసం చేశారంటూ బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. టామ్‌కామ్ ద్వారా జర్మనీలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అభ్యర్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేసి, అర్హత సాధించిన వారిలో చాలామందిని విదేశాలకు పంపలేదని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బాధితులకు ఫీజులు తిరిగి చెల్లించాలని,మంత్రి వివేక్ వెంకటస్వామి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

జర్మనీలో సాంకేతిక, నర్సింగ్, వేర్‌హౌస్ తదితర ఉద్యోగాల కోసం టామ్‌కామ్ ప్రకటనలు ఇచ్చిందని, ఒక్కో అభ్యర్థి నుంచి రూ.4.1 లక్షలు వసూలు చేయాలని నిర్ణయించారని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఆరు నెలలపాటు జర్మన్ భాషలో శిక్షణ ఇచ్చి, బి1 స్థాయి పరీక్ష కోసం మరో రూ.20 వేలు చెల్లించాలని కోరారని ఆరోపించారు. వందలాది మంది శిక్షణ పొందగా, బి1 స్థాయి ఉత్తీర్ణులైన వారిలో పది మందిని కూడా జర్మనీకి పంపలేదని అన్నారు.

అభ్యర్థులతో చేసుకున్న ఒప్పందాల్లో టామ్‌కామ్ పేరు లేకుండా ఫేర్ స్ట్రీట్ కంపెనీ పేరు మాత్రమే ఉందని, ఉద్యోగాలు రాకపోవడంతో డబ్బులు తిరిగి అడిగిన బాధితులను సంబంధిత కంపెనీని సంప్రదించాలని అధికారులు చెబుతున్నారని విమర్శించారు.విదేశాలకు వెళ్లిన ఓ అభ్యర్థికి హామీ ఇచ్చిన ఉద్యోగానికి భిన్నమైన పని అప్పగించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఫేర్ స్ట్రీట్ కంపెనీపై కేసులు నమోదు చేసి, బాధితులందరికీ డబ్బులు తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు. కార్మిక శాఖలో బీమా పథకం, ఔట్‌సోర్సింగ్ నియామకాలకు సంబంధించిన వ్యవహారాల్లోనూ అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, విదేశాల్లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల వివరాలను బహిర్గతం చేయాలని కోరారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్ తరఫున పోరాడుతామని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.