నషా ముక్త్ భారత్ తోనే ఆరోగ్యవంతమైన సమాజం -ఎంపీ డికే అరుణ
పాలమూరు యూనివర్సిటీ, మేజర్ న్యూస్ :మాదకద్రవ్యాల నిర్మూలనకు యువత బిగించాలని ఎంపీ డీకే అరుణ పిలుపు నిచ్చారు.,పాలమూరు యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ సెల్, ఉద్భావ్ సేవా సంసద్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు యూనివర్సిటీ లైబ్రరీ ఆడిటోరియంలో నిర్వహించిన నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, వీసీ ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్ పాల్గొని ప్రసంగించారు. మాదకద్రవ్యాల రహిత భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎంపీ డీకే అరుణ గారు పిలుపునిచ్చారు.మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితాలకే కాకుండా కుటుంబాలు, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. యువతలో అవగాహన పెంపొందించేందుకు విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని సూచించారు.ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలతో సామాజిక చైతన్యం: వీసీ ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, చైతన్యం పెంపొందిస్తున్నామని పాలమూరు యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్ అన్నారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ విద్య, నైపుణ్యాభివృద్ధి, సమాజ సేవపై దృష్టి సారించాలని సూచించారు. యువత దేశ భవిష్యత్తుకు పునాది అని, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.
విద్యార్థుల స్కిట్లు ఆకట్టుకున్నాయి-
మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరిస్తూ విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్లు ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శనల ద్వారా మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులు చక్కగా వివరించి, వాటికి దూరంగా ఉండాలనే సందేశాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య పి. రమేష్ బాబు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా. ప్రవీణ, ప్రిన్సిపాళ్లు ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి, డా. కరుణాకర్ రెడ్డి, డా. భూమయ్య, డా. ఈశ్వర్ కుమార్, ప్లేస్మెంట్ ఆఫీసర్ డా. అర్జున్ కుమార్, యూత్ ఆఫీసర్ కోటా నాయక్, ఇతర అధికారులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, ఎన్ఎస్ఎస్ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎం. ఓంప్రకాష్, పాలమూరు యూనివర్సిటీ, మహబూబ్ నగర్.