వైసీపీ నుంచి టీడీపీలోకి 100 కుటుంబాలు చేరిక
జంగారెడ్డిగూడెం, మేజర్ న్యూస్, మండలం లోని పుట్లగట్లగూడెం గ్రామంలో వైఎస్సార్సీపీకి చెందిన 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. గ్రామ పార్టీ అధ్యక్షుడు సీలం వెంకటరాజు కృష్ణంరాజు, మాజీ జెడ్పీటీసీ రామచంద్రరావు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్, ఏలూరు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ముత్తా రెడ్డి, చింతలపూడి నియోజకవర్గ పరిశీలకుడు రావి వెంకటేశ్వరరావు సమక్షంలో వారంతా టీడీపీ కండువాలు కప్పుకున్నారు.అనంతరం గ్రామానికి చెందిన ఎంపీటీసీ, మండల జెడ్పీటీసీ అభ్యర్థులను ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ప్రజలకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానానికి ఆకర్షితులై పలువురు కూటమి వైపు వస్తున్నారని పేర్కొన్నారు. పుట్లగట్లగూడెంలో 100 కుటుంబాలు టీడీపీలో చేరడం సంతోషంగా ఉందని, పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్తా రెడ్డి మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ పాలనలో ఎదురైన సమస్యలను ప్రజలు మర్చిపోలేదని, కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నియోజకవర్గ పరిశీలకుడు రావి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు కుక్కల మాధవరావు, మండల కార్యదర్శి బూస సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు గొల్లమందల శ్రీనివాస్, చింతలపూడి నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కొదమ వెంకటేశ్వరరావుతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.